నేటి నుంచి పల్లె వెలుగు టౌన్‌ బస్‌ పాస్‌

ABN , First Publish Date - 2023-07-18T05:08:02+05:30 IST

ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు టీఎ్‌సఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పల్లెవెలుగు టౌన్‌ బస్‌పా్‌సకు శ్రీకారం చుట్టింది

నేటి నుంచి పల్లె వెలుగు టౌన్‌ బస్‌ పాస్‌

నాలుగు జిల్లా కేంద్రాల్లో అమలు: ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు టీఎ్‌సఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పల్లెవెలుగు టౌన్‌ బస్‌పా్‌సకు శ్రీకారం చుట్టింది. మొదట కరీంనగర్‌, మహబూబ్‌ నగర్‌, నిజామాబాద్‌, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లెవెలుగు బస్సుల్లో ఈ పాస్‌ను అమలుచేయాలని నిర్ణయించింది. ఈ టౌన్‌ పాస్‌తో ప్రయాణికులు కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌లలో 10 కిలోమీటర్లు, నిజామాబాద్‌, నల్లగొండల్లో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయవచ్చని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. సోమవారం బస్‌పాస్‌ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, 5 కిలోమీటర్ల పరిధికి రూ.500 చొప్పున చెల్లించి పల్లె వెలుగు టౌన్‌ బస్‌పా్‌సను తీసుకోవచ్చని తెలిపారు. ఈ పాస్‌ మంగళవారం నుంచి అమల్లోకి రానున్నట్లు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌, వరంగల్‌లో జనరల్‌ బస్‌పాస్‌ అందుబాటులో ఉందన్నారు. జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారిపై ఆర్థికభారం తగ్గ్గించేందుకు పల్లె వెలుగు టౌన్‌ బస్‌పాస్‌ ఉపయోగంగా ఉంటుందన్నారు.

Updated Date - 2023-07-18T05:08:02+05:30 IST