ప్రజలతోనే ఫ్రెండ్లీ.. క్రిమినల్స్‌తో కఠినమే

ABN , First Publish Date - 2023-02-01T00:54:04+05:30 IST

ప్రజలతోనే ఫ్రెండ్లీ పో లీసింగ్‌, క్రిమినల్స్‌తో మాత్రం కఠినంగానే ఉంటామని యా దాద్రి జోన్‌ డీసీపీ రాజేష్‌ చంద్ర అన్నారు. డీసీపీగా బాధ్యతలు స్వీకరించాక భువనగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడబోమని, అసాంఘిక శక్తులను కఠినంగా అణచివేస్తామ న్నారు. సివిల్‌ కేసుల్లో వచ్చే ఫిర్యాదులపై క్షేత్ర పరిశీలన చేశాకే కేసులు నమోదు చేస్తామని, ఈ మేరకు యాదాద్రి జోన్‌ ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు.

ప్రజలతోనే ఫ్రెండ్లీ.. క్రిమినల్స్‌తో కఠినమే

యాదాద్రి జోన్‌ డీసీపీ రాజేష్‌ చంద్ర

భువనగారి టౌన్‌, జనవరి 31: ప్రజలతోనే ఫ్రెండ్లీ పో లీసింగ్‌, క్రిమినల్స్‌తో మాత్రం కఠినంగానే ఉంటామని యా దాద్రి జోన్‌ డీసీపీ రాజేష్‌ చంద్ర అన్నారు. డీసీపీగా బాధ్యతలు స్వీకరించాక భువనగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడబోమని, అసాంఘిక శక్తులను కఠినంగా అణచివేస్తామ న్నారు. సివిల్‌ కేసుల్లో వచ్చే ఫిర్యాదులపై క్షేత్ర పరిశీలన చేశాకే కేసులు నమోదు చేస్తామని, ఈ మేరకు యాదాద్రి జోన్‌ ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. పనులకోసం రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు చేసే ఒత్తిడిని పరిగణనలోకి తీసుకోబోమని, వాస్తవాల ఆధారంగానే కేసుల నమోదు, దర్యాప్తు సాగుతుందన్నారు.

ప్రతీ పోలీస్టేషన్‌లో విజిటర్స్‌ బుక్‌

యాదాద్రి జోన్‌ పరిధిలోని అన్ని పోలీస్టేషన్లలో విజిటర్స్‌ బుక్‌ను అందుబాటులో ఉం చుతామని, న్యాయం కోసం బాధితులు పోలీస్టేషన్‌కు వచ్చిన సమయానికి అధికారులు అందుబాటులో లేకుంటే వివరాలను విజిటర్స్‌ బుక్‌లో రాసిన వివరాల ఆధారంగా ఎస్‌హెచ్‌వో బాధితులకు ఫోన్లు చేస్తారని తెలిపారు. అలాగే జోన్‌ పరిధిలో వాట్స్‌పలో ఫిర్యాదులను చేసే సదుపాయాన్ని త్వరలో ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. యాదాద్రి జోన్‌లో దొంగతనాలు, అసాంఘిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే దొరి కిపోతామనే భయపడేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం నేను సైతం పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి ప్రజాప్రతినిధులు, నాయకులు, పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థల సాయాన్ని కోరుతామన్నారు.

యాదగిరిగుట్ట ఆలమ భద్రతకు ప్రత్యేక కార్యాచరణ

ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భద్ర తకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు రాజేష్‌ చంద్ర తెలిపారు. ఇందుకోసం త్వరలో అవసరమైన పోలీసు అధికారులు, సిబ్బంది నియామకాలను పూర్తిచేస్తామన్నా రు. జిల్లా మీదుగా వెళ్లే రెండు జాతీయ రహదారులతోపాటు జిల్లా అంతటా పెట్రోలింగ్‌ ను పెంచుతామని, రోడ్డు ప్రమాదాలను పోలీసులు నివారించలేరని, ద్విచక్ర వాహనదారులందరు తమ ప్రాణాల భద్రతకు విధిగా హెల్మెట్‌ ధరించాలని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలన్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన తాను 2008లో వరంగల్‌ నిట్‌లో ఇంజనీరింగ్‌ చేస్తున్న సమయంతో పోలిస్తే నేటి పోలీసింగ్‌ విధానంలో చాలా మార్పులు వచ్చాయని, ప్రస్తుతం ర్యాష్‌ పోలీసింగ్‌ సినిమాకే పరిమితమైందన్నారు. బొమ్మలరామారం మండ లంలోని ఓ తండాలో పోలీసులపై జరిగిన దాడి ఘటనలో ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశామని, మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకుంటామన్నారు.

Updated Date - 2023-02-01T00:54:06+05:30 IST