జీవన్‌రెడ్డీ.. అవగాహన లేకుండా మాట్లాడొద్దు
ABN , Publish Date - Dec 19 , 2023 | 03:06 AM
భద్రాచలం పరిసరాల్లోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపినప్పుడు పార్లమెంటులో బీఆర్‌ఎస్ ఎంపీలు ఏమీ మాట్లాడ లేదని కాంగ్రెస్
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
హైదరాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): భద్రాచలం పరిసరాల్లోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపినప్పుడు పార్లమెంటులో బీఆర్‌ఎస్ ఎంపీలు ఏమీ మాట్లాడ లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవగాహన లేకుండా ఏదంటే అది మాట్లాడొద్దని జీవన్‌రెడ్డికి హితవు పలికారు. తాము లోక్ సభలో మాట్లాడిన వీడియోలను జీవన్ రెడ్డికి పంపుతున్నానని, ఆనాడు రాజ్యసభలో మెజార్టీగా ఉన్న కాంగ్రెస్ నాయకులే.. ఆ మండలాలను ఏపీలో కలుతున్నప్పుడు అడ్డుపడలేదని వినోద్‌కుమార్ గుర్తుచేశారు.