Share News

జేఎన్‌టీయూ అభివృద్ధికి రూ. కోటి విరాళం

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:47 AM

జేఎన్‌టీయూ అభివృద్ధి కోసం రూ. కోటి విరాళం ప్రకటించి పూర్వ విద్యార్థి, గోల్డ్‌డ్రాప్‌ అధినేత కన్హయలాల్‌ తన ఉదారతను చాటుకున్నారు.

జేఎన్‌టీయూ అభివృద్ధికి రూ. కోటి విరాళం

ఉదారత చాటిన పూర్వ విద్యార్థి

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూ అభివృద్ధి కోసం రూ. కోటి విరాళం ప్రకటించి పూర్వ విద్యార్థి, గోల్డ్‌డ్రాప్‌ అధినేత కన్హయలాల్‌ తన ఉదారతను చాటుకున్నారు. ఈ నెల 22న జరగనున్న జేఎన్‌టీయూ గ్లోబల్‌ అల్యూమ్ని మీట్‌ (జెగమ్‌-2023) ఏర్పాట్ల గురించి చర్చించేందుకు శనివారం సాయంత్రం యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ చాంబర్‌లో పూర్వ విద్యార్థులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీ అభివృద్ధికి సహకరించాలని వీసీ కోరగా, కన్హయలాల్‌ స్పందించి రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు. ఈ సమావేశానికి 1971 నుంచి 1983 బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులతో పాటు కళాశాల తొలి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆస్థానా కూడా హాజరయ్యారు. అనంతరం వైస్‌చాన్స్‌లర్‌ కట్టా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. జేఎన్‌టీయూలో అల్యూమ్నిని బలోపేతం చేసేందుకు ప్రత్యేక డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో గ్లోబల్‌ అల్యూమ్ని మీట్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - Dec 18 , 2023 | 06:33 AM