భువనగిరికి నిధుల వరద

ABN , First Publish Date - 2023-04-22T00:50:10+05:30 IST

భువనగిరి నియోజకవర్గానికి నిధుల వరద పారింది. హైదరాబాద్‌ నగరానికి చెరువలో ఉన్నా, నిధుల లేమీతో ఇప్పటి వరకు అత్యవసర అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నారు. దీంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అభివృద్ధి, సంక్షే మ పథకాలకు నిధులు మంజూరు చేయాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రికి విన్నవించారు.

భువనగిరికి నిధుల వరద

అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.45కోట్లు మంజూరు

ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి

యాదాద్రి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): భువనగిరి నియోజకవర్గానికి నిధుల వరద పారింది. హైదరాబాద్‌ నగరానికి చెరువలో ఉన్నా, నిధుల లేమీతో ఇప్పటి వరకు అత్యవసర అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నారు. దీంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అభివృద్ధి, సంక్షే మ పథకాలకు నిధులు మంజూరు చేయాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రికి విన్నవించారు. దీం తో స్పందించిన ఆయన నియోజకవర్గంలోని నాలుగు మం డలాలతోపాటు రెండు మునిసిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక అభివృద్ధి నిధి (స్పెషల్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌)కింద రూ.45కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. ఉత్తర్వులను ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్‌ శుక్రవారం అందజేశారు.

సీఎం మంజూరు చేసిన నిధులతో నియోజకవర్గంలోని భువనగిరి మునిసిపాలిటీ, మండలంతోపాటు బీబీనగర్‌, వలిగొండ, భూదాన్‌పోచంపల్లి మండలాల్లో అభివృద్ధి పను లు చేపట్టనున్నారు. ప్రధానంగా నియోజకవర్గంలోని గ్రా మాల్లో, మునిసిపాలిటీల్లో సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్‌, ఓపెన్‌ డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు, భువనగిరిలో మినీ స్టేడియం నిర్మాణం, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటుతోపాటు విద్యుత్‌ లైన్ల షిఫ్టింగ్‌, తదితర పనులు చేపట్టనున్నారు. స్థానిక సంస్థల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో త్వర లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఏ గ్రామా ల్లో, పట్టణాల్లో ప్రధాన సమస్యలు ఉన్నాయో గుర్తించి, వెంటనే పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోనున్నారు.

భువనగిరిలో కొనసాగుతున్న పనులు

జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణం రూపురేఖలు మా ర్చేందుకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించా రు. ప్రభుత్వం ఇటీవల రూ.20కోట్లు మంజూరు చేసింది. తెలంగాణ అర్బన్‌ఫైనాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(టీయూఎ్‌ఫఐడీసీ) నిధులు రూ.15కోట్లు, హెచ్‌ఎండీఏ నిధులు రూ.5కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టారు. అర్బన్‌ ఫారెస్టు నిధులతో చెరువు సుందరీకరణ పనులు, అదేవిధంగా పట్టణంలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను నిర్మించారు. ఇటీవల మరో రూ.9కోట్ల వరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో భువనగిరి మునిసిపాలిటీ పరిధిలోని బొమ్మాయిపల్లి రోడ్డు నుంచి రాయిగిరి వరకు 100పీట్లతో రోడ్డును అభివృద్ధి చేశారు. టీచర్స్‌ కాల నీనుంచి నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్‌ వరకు 2.12కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పూర్తయింది. రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లను నిర్మించనున్నారు. భువనగిరి-నల్లగొం డ రోడ్డులో సీసీతోపాటు బీటీ రోడ్లు వేశారు. మొత్తం రూ.34కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే నియోజకవర్గంలోని పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే కోరగా, ఆ మేరకు ఆయన వెంటనే స్పందించారు. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ కావడంతో నియోజకవర్గంలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్య లు తీసుకోనున్నారు. ప్రధానంగా గ్రామాల్లో, పట్టణాల్లో సీసీరోడ్లు, బీటీ రోడ్లు చాలా వరకు పెండింగ్‌లో ఉండగా, మరమ్మతులు కూడా చేపట్టాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.45కోట్లు మంజూరు చేయడంతో పలు పెండింగ్‌లో ఉన్న పనులతో పాటు కొత్తగా పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలో సీఎ్‌సఆర్‌ నిధులతో భువనగిరి కళాశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న మినీ స్టేడియానికి నిధులు కేటాయించనున్నారు.

సీఎంకు కృతజ్ఞతలు : ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.45కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, వెంటనే పరిష్కరిస్తాం. సీఎం కేసీఆర్‌ భువనగిరి అభివృద్ధికి ఇప్పటికే కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. నియోజకవర్గంలో చేపట్టనున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం నిధులు మంజూరు చేయాలని అడిగిన వెంటనే స్పందించారు. భువనగిరి అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టిపెట్టారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.

Updated Date - 2023-04-22T00:50:10+05:30 IST