ప్రాణం తీసిన ‘ఫిట్స్‌’

ABN , First Publish Date - 2023-06-26T01:08:57+05:30 IST

పొలం దున్నుతున్న సమయంలో ఫిట్స్‌ రావడంతో ఆ ట్రాక్టర్‌ కింద పడి యువకుడు మృతి చెందాడు.

ప్రాణం తీసిన ‘ఫిట్స్‌’
శ్రీరాం (ఫైల్‌ ఫొటో)

దుక్కి దున్నుతుండగా మూర్ఛ

కింద పడటంతో ట్రాక్టర్‌ పైనుంచి వెళ్లి మృత్యువాత

పాలకవీడు, జూన 25: పొలం దున్నుతున్న సమయంలో ఫిట్స్‌ రావడంతో ఆ ట్రాక్టర్‌ కింద పడి యువకుడు మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జానపహాడ్‌ గ్రామంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. పాలకవీడు ఎస్‌ఐ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జానపహాడ్‌ గ్రామానికి చెందిన పిట్టల చినసైదులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా, ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె, అల్లుడు పదేళ్ల క్రితం మృతిచెందగా, వారి కుమారుడు యతవిడబోయిన శ్రీరాం (22) బాగోగులు చినసైదు లు చూసుకుంటున్నాడు. శీరాంకు మూర్ఛ వ్యాధి ఉండటంతో, చికిత్స చేయించగా, తగ్గింది. ఆరు నెలలుగా ఫిట్స్‌ రాకపోవడంతో శ్రీరాం ఆరోగ్యంగానే ఉన్నాడు. ఆదివారం తమ పొలం లో దుక్కి దున్నేందుకు శ్రీరాం సొంత ట్రాక్టర్‌ను నడుపుకుంటూ వెళ్లాడు. దున్నే సమయంలో శ్రీరాంకు ఫిట్స్‌ రావడంతో, ఒక పక్కకు ఒరిగి జారి కిందపడగా, ట్రాక్టర్‌ టైర్‌ అ తని పైనుంచి వెళ్లి 15 మీటర్ల వర కు వెళ్లి ఆగింది. ఈ ప్రమాదంలో శ్రీరామ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పొలంలో అచేతనంగా పడి ఉన్న శ్రీరాంను సమీపంలో ఉన్న రైతులు చూసి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకు ని శ్రీరాం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తాత చినసైదులు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-06-26T01:08:57+05:30 IST