Share News

పీఏపల్లిలో హరితహారం చెట్ల నరికివేత

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:54 PM

గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహా రం పథకం అధికారుల అవగాహన లోపంతో నీరు గారిపోతుంది.

 పీఏపల్లిలో హరితహారం చెట్ల నరికివేత
విద్యుత తీగలకు చెట్లు తాకుతుండటంతో నరికివేసిన విద్యుత శాఖ అధికారులు

పీఏపల్లిలో హరితహారం చెట్ల నరికివేత

పెద్దఅడిశర్లపల్లి, డి సెంబరు 17: గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహా రం పథకం అధికారుల అవగాహన లోపంతో నీరు గారిపోతుంది. హరితహారం పథకం కోసం కోట్లా ది రూపాయలు ఖర్చుపెట్టినా అధికారుల నిర్లక్ష్యం తో నాటిన మొక్కలు గొ డ్డలి వేటుకు గురవుతున్నాయి. మండలంలో హారితహరం లో భాగంగా నాటిన మొక్కలు పూర్తిగా విద్యుత లైన కిందనే అధికంగా ఉన్నా యి. ఈ మొక్కలు ఎలా పెరుగుతాయి. పెరిగితే విద్యుత లైన వల్ల ప్రమాదం ఉందా అనే అలోచనే లేకుండా ఆ పూటకు మొక్కలు నాటి లెక్కలు రాసుకున్నారు. కానీ ప్రభుత్వ లక్ష్యం మొక్కలు పెంచాలి అని అఽధికారులు గుర్తించడం లే దు. అధికారుల లక్ష్యం ఒక్కటే మొక్కలు నాటాలి లెక్కలు రాయాలి. ఆ మొ క్కలు పెరిగి పెద్దయ్యాక ఎలా ఉంటా యో గుర్తించడం లేదు. అఽధికారుల నిర్లక్ష్యంతో హరితహారంలో నాటిన మొక్కలు పెరిగి గొడ్డలి వేటుకు గురవుతున్నాయి. మండలంలోని అం గడిపేట ఎక్స్‌రోడ్డు నుంచి మండలకేంద్రానికి వెళ్లే రహదారిలో అధికారులు కరెంట్‌ వైర్ల కింద మొక్కలు నాటారు. ఈ మొక్కలు ఏపుగా పెరిగి కరెంట్‌ వైర్లకు తగిలి విద్యుత సరఫరాలో అంతరా యం ఏర్పడుతోంది. దీంతో విద్యుతశాఖ వారు ఆ చెట్లను నరికివేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మొక్కలు నాటే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుని మొక్కలు నాటితే హరితహారం కార్యక్రమం విజయవంతమవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:54 PM