జస్టిస్ అభిషేక్‌రెడ్డికి వీడ్కోలు
ABN , First Publish Date - 2023-05-13T03:21:42+05:30 IST
ఇటీవల పట్నా హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ ఎ. అభిషేక్‌రెడ్డికి హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు.
హైదరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి) : ఇటీవల పట్నా హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ ఎ. అభిషేక్‌రెడ్డికి హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో జస్టిస్ అభిషేక్‌రెడ్డి సేవలను కొనియాడారు. ఆయన ఇచ్చిన కీలక తీర్పులను అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ శ్లాఘించారు. తెలంగాణ భూమి పుత్రుడైన జస్టిస్ అభిషేక్‌రెడ్డి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ మాట్లాడుతూ జస్టిస్ అభిషేక్ రెడ్డి దాదాపు 11 వేల కేసులను పరిష్కరించారని.. కష్టపడే తత్వానికి ఆయన నిదర్శనమని పేర్కొన్నారు. పౌరుల హక్కులను రక్షించడమే కాకుండా వారు గౌరవంగా జీవించేలా చూడటం సైతం కోర్టుల విధి అని జస్టిస్ అభిషేక్ రెడ్డి తెలిపారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నవీన్‌రావు, అందరు జడ్జిలు, బార్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ సునీల్ గౌడ్, హైకోర్టు బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సీహెచ్ కల్యాణ్‌రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతా్‌పరెడ్డి, డీఎ్‌సజీ గాడి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ అభిషేక్‌రెడ్డి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.