రాత్రిపూట పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ABN , First Publish Date - 2023-10-30T03:47:57+05:30 IST
రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. కుమురంభీమ్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో 11-14 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే మూడు రోజుల పాటు రాత్రిపూట ఉష్ణోగ్రతలు 14-22 డిగ్రీల మధ్య నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం 27 జిల్లాల్లో సగటు పగటి ఉష్ణోగ్రతలు 37.7 నుంచి 34 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు ఆదివారం కాస్త తగ్గాయి. ఇక రాష్ట్రంలో సోమవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మంగళవారం నుంచి పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది.