నకిలీ విత్తు.. రైతు చిత్తు

ABN , First Publish Date - 2023-06-03T00:55:35+05:30 IST

సీజన్‌కు ముందే జిల్లా పోలీ స్‌ యంత్రాంగంతో పాటు వ్యవసాయశాఖ, టాస్క్‌ఫో ర్సు బృందాలు నిరంతరం నిఘా పెట్టినప్పటికీ నకిలీ పత్తి విత్తనాలు యథేచ్ఛగా జిల్లాకు చేరుతున్నట్లు స్పష్టమవుతోంది. గత నెల 31న మునుగోడులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నకిలీ పత్తి విత్తనాలు తీసుకువచ్చి డీలర్లు, రైతులకు చేరవేసే ప్ర యత్నంలో పోలీసులకు పట్టుబడ్డారు. ఆ నిందితులిద్ద రు ఇచ్చిన సమాచారంతో పోలీసులు తీగ లాగితే డొం క కదిలింది.

నకిలీ విత్తు.. రైతు చిత్తు

జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల కలకలం

పోలీసులు, వ్యవసాయశాఖ నిఘాను దాటేస్తొన్న దళారులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి జిల్లాకు చేరవేసే ప్రయత్నాలు

నల్లగొండ, జూన్‌ 2: సీజన్‌కు ముందే జిల్లా పోలీ స్‌ యంత్రాంగంతో పాటు వ్యవసాయశాఖ, టాస్క్‌ఫో ర్సు బృందాలు నిరంతరం నిఘా పెట్టినప్పటికీ నకిలీ పత్తి విత్తనాలు యథేచ్ఛగా జిల్లాకు చేరుతున్నట్లు స్పష్టమవుతోంది. గత నెల 31న మునుగోడులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నకిలీ పత్తి విత్తనాలు తీసుకువచ్చి డీలర్లు, రైతులకు చేరవేసే ప్ర యత్నంలో పోలీసులకు పట్టుబడ్డారు. ఆ నిందితులిద్ద రు ఇచ్చిన సమాచారంతో పోలీసులు తీగ లాగితే డొం క కదిలింది. మునుగోడుకు 10 ప్యాకెట్లలో ప్యాక్‌చేసి గుంటూరు నుంచి తెచ్చిన విషయాన్ని గమనించి వీరి ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో గుంటూరులో నల్లగొండ జిల్లాకు తరలించడానికి సిద్ధంగా ఉంచిన ఓ పాత మిల్లుపై పోలీసులు రైడ్‌ చేయడంతో మొత్తం రూ.10లక్షల విలువైన 10క్వింటాళ్ల 45కిలోల పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. వీటిని పోలీసులు జిల్లా పోలీస్‌ కార్యాలయానికి తరలించారు. జిల్లాకు చేరకముందే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతాలైన కోదాడ, దామరచర్ల, నాగార్జునసాగర్‌ పరిసర ప్రాంతాల్లో పటిష్ఠమైన నిఘా ద్వారా నకిలీ పత్తివిత్తనాలను అరికట్టాలని భావించారు. పోలీసులు, వ్యవసాయ అధికారులు అనుకున్న విధంగా కాకుండా నకిలీ విత్తనాలు చేరవేసే ముఠా యథేచ్ఛగా కొంత మేరకు జిల్లాకు చేరవేయగా, మిగతా విత్తనాలు చేరవేసేందుకు ఏపీ ప్రాంతంలోని సరిహద్దులో పెద్దఎత్తున నిల్వ ఉంచుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల జిల్లాలో టాస్క్‌ఫోర్సు బృందాలు పలు దుకాణాలను తనిఖీ చేశాయి.

రైతులకు మాయమాటలు చెబుతూ..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారు నల్లగొండ జిల్లాలోని చాలా గ్రామాల్లో పొలాలు, చేలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఇందులో కొంత మంది ఏపీకి చెందిన పెట్టుబడిదారులు వ్యవసాయం ముసుగులో దళారీ దందా చేస్తున్న వారు రైతులకు మాయమాటలు చెప్పి నకిలీ విత్తనాలను అంటగడుతున్నట్లు సమాచారం. తమకు ఇప్పుడే డబ్బులు ఇవ్వనవసరం లేదని, పత్తి దిగుబడి వచ్చాక తీసుకుంటామని చెబుతూ అందమైన ప్యాకెట్లలో నకిలీ విత్తనాలను నింపి రైతులకు ఇస్తున్నారు. ఒరిజినల్‌ పత్తి విత్తనాలు 450 గ్రాములకు రూ.750 నుంచి రూ.800 ఉంటుండగా ఈ నకిలీ విత్తనాలు 50శాతం ధరకే రైతులకు ఇస్తూ నట్టేట ముంచుతున్నారు. ఈ విత్తనాలు వేస్తే ఏపుగా పెరగడం తప్ప పత్తి దిగుబడి రాక రైతు నష్టపోయిన సందర్భాలూ ఉన్నాయి. నకిలీ పత్తి విత్తనాలను రైతులకు అంటగడుతూ మోసం చేస్తున్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం. పోలీసులు, వ్యవసాయ శాఖ, టాస్క్‌ఫోర్సు బృందాలు సమన్వయంతో పనిచేస్తే తప్ప నకిలీ పత్తి విత్తనాలను అరికట్టే అవకాశాలుండవు. కానీ అందుకు విరుద్దంగా జిల్లాలో పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది రైతులను ఏపీకి చెందిన కొందరు దళారులు మభ్యపెట్టి, మాయమాటలు చెప్పి వారిని ఆటోలు, ప్రైవేటు వాహనాలు, కార్లలో ఏపీలోని పలు ప్రాంతాలకు తీసుకువెళ్లి అక్కడి నుంచి నకిలీ రసీదులు ఇస్తూ వారి వెంట పత్తి విత్తనాలను గ్రామాలకు చేరవేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అమాయకులైన రైతులకు అవి మంచి విత్తనాలా? నకిలీ విత్తనాలా? తెలియక గ్రామాలకు తీసుకువస్తున్నారు. ఈ రైతుల ద్వారానే ఇతర రైతులకు నకిలీ పత్తి విత్తనాలను అందిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

నకిలీ విత్తనాలతో దిగుబడిపై ప్రభావం

ఇప్పటికే రెండేళ్లుగా రెండు సీజన్లలో జిల్లాలో పత్తివేసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నకిలీ పత్తి విత్తనాలతోపాటు ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు రైతులను నిండాముంచాయి. మంచి విత్తనాలైతే ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంటుంది. కానీ గత రెండు సీజన్లలో ఎకరాకు ఐదు క్వింటాళ్ల దిగుబడి కూడా రాని పరిస్థితి ఉంది. దీనికి తోడు క్వింటాకు రూ.7వేలు మాత్రమే ధర పలకడంతో రైతులు పెట్టుబడు లు కూడా రాక తీవ్రంగా నష్టపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో నకిలీ విత్తనాలు రైతులను భయాందోళనకు గు రి చేస్తున్నాయి. ఏవి అసలువో..? ఏవి నకిలీవో..? తెలియడం లేదని రైతులు వాపోతున్నారు. లైసెన్స్‌ ఉన్న వ్యా పారుల వద్ద ఒక్కో ప్యాకెట్‌ రూ.800 వెచ్చించి 450 గ్రాముల ప్యాకెట్‌ను తీసుకెళ్తే తీరా అవి పంట దిగుబడి రాకపోతే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రతిఏటా వాపోతున్నారు. రైతులు ఆవేదన వ్యక్తం చేసిన మాదిరిగానే మరొకసారి నకిలీ పత్తి విత్తనాల కలకలం జిల్లాలో రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికైనా వ్యవసాయ, పోలీ్‌సశాఖ పటిష్ఠమైన నిఘా ద్వారా నకిలీ పత్తి విత్తనాలను అరికట్టాల్సిన అవసరం ఉంది.

నిరంతరం మానిటరింగ్‌ చేస్తున్నాం : సుచరిత, జేడీఏ, నల్లగొండ

నకిలీ పత్తి విత్తనాలను అరికట్టేందుకు పోలీస్‌ అధికారులు, వ్యవసాయశాఖ నిరంతరం మానిటరింగ్‌ చేస్తుంది. మునుగోడులో పట్టుబడినవి కొన్ని నకిలీ విత్తనాలు కాగా, సదరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా గుంటూరులో దాచిన విత్తనాలను స్వాధీనం చేసుకొని నల్లగొండకు తెచ్చారు. నల్లగొండ జిల్లాకు ఏ ప్రాంతం నుంచి కూడా నకిలీ విత్తనాలు చేరకుండా పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నాం.

Updated Date - 2023-06-03T00:55:35+05:30 IST