‘డబుల్‌’ ఇళ్లను కేటాయించడంలో విఫలం : టీడీపీ

ABN , First Publish Date - 2023-09-04T01:10:05+05:30 IST

నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటాయించడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తి గా విఫలమైందని టీడీ పీ నల్లగొండ నియోజకవర్గ ఇనచార్జి ఎల్‌వీ యాదవ్‌ అన్నారు.

 ‘డబుల్‌’ ఇళ్లను కేటాయించడంలో విఫలం : టీడీపీ
డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పరిశీలిస్తున్న టీడీపీ నాయకులు

‘డబుల్‌’ ఇళ్లను కేటాయించడంలో విఫలం : టీడీపీ

నల్లగొండ, సెప్టెంబరు 3: నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటాయించడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తి గా విఫలమైందని టీడీ పీ నల్లగొండ నియోజకవర్గ ఇనచార్జి ఎల్‌వీ యాదవ్‌ అన్నారు. జి ల్లా కేంద్ర సమీపంలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల గృహ సముదాయాన్ని ఆదివారం ఆయన టీడీపీ నాయకులతో సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కట్టిన ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఇ చ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చడం లేదని, దళితులకు మూడెకరాల భూమి పథకం అమలు చేయలేదన్నారు. దళితబంధు కొంతమంది కార్యకర్తలకే అమలు చేశారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మో సం చేశారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టడం మానుకు ని ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణశాఖ అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు, నాయకులు ఎంకేఐ సిద్ధిక్‌, ఎంఏ రఫిక్‌, మనోహర్‌, పరమేష్‌, స్వరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T01:10:05+05:30 IST