11న ఎస్సై, ఏఎస్సై పోస్టుల పరీక్షలు
ABN , First Publish Date - 2023-03-05T03:19:34+05:30 IST
పోలీస్ శాఖలో ఎస్సై (ఐటీ), ఏఎస్సై (ఫింగర్‌ప్రింట్) పోస్టుల భర్తీకి రాత పరీక్షలు ఈ నెల 11న నిర్వహించనున్నట్లు పోలీస్ నియామక బోర్డు చైౖర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.
రేపట్నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు
హైదరాబాద్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): పోలీస్ శాఖలో ఎస్సై (ఐటీ), ఏఎస్సై (ఫింగర్‌ప్రింట్) పోస్టుల భర్తీకి రాత పరీక్షలు ఈ నెల 11న నిర్వహించనున్నట్లు పోలీస్ నియామక బోర్డు చైౖర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సై (ఐటీ) పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుందన్నారు. ఏఎస్సై(ఫింగర్‌ప్రింట్) పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఉంటుందని వెల్లడించారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు పోలీస్ నియామక బోర్డు వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏవైనా సమస్యలు తలెత్తితే support@tslprb.-inకి మెయిల్ పంపాలని లేదా 9393711110, 9391005006 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని సూచించారు. ఎస్సై(ఐటీ), ఏఎస్సై (ఫింగర్‌ప్రింట్) పోస్టులకు నిర్వహించే మిగతా రెండు పరీక్షలకు వేరుగా హాల్ టికెట్లు జారీ చేస్తామన్నారు.