రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్‌హోమ్’
ABN , Publish Date - Dec 23 , 2023 | 03:19 AM
సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం ‘ఎట్‌హోమ్’ రిసెప్షన్ జరిగింది. దక్షిణాది పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ము గత సోమవారం హైదరాబాద్ విచ్చేశారు.
గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ హాజరు
అల్వాల్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం ‘ఎట్‌హోమ్’ రిసెప్షన్ జరిగింది. దక్షిణాది పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ము గత సోమవారం హైదరాబాద్ విచ్చేశారు. అయితే, ఆనవాయితీలో భాగంగా ఆమె ఎట్‌హోమ్ రిసెప్షన్ నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు, బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రపతి ఆతిథ్యం స్వీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతి ఆతిథ్యానికి గవర్నర్ తమిళిసై ఎక్స్(ట్విటర్) ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. కాగా, శీతాకాల విడిది ముగించుకుని రాష్ట్రపతి 23వ తేదీన హైదరాబాద్ నుంచి జైపూర్‌కు వెళతారు.