Share News

బీఆర్‌ఎస్‌లో చేరిన ఎర్ర శేఖర్‌, పి.చంద్ర శేఖర్‌

ABN , First Publish Date - 2023-10-30T03:12:23+05:30 IST

అధికార బీఆర్‌ఎ్‌సలో చేరికల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ టికెట్లు దక్కని ప్రతిపక్ష పార్టీల నేతలు కారు ఎక్కుతున్నారు.

బీఆర్‌ఎస్‌లో చేరిన ఎర్ర శేఖర్‌, పి.చంద్ర శేఖర్‌

కేసీఆర్‌తో నాగం భేటీ.. త్వరలో పార్టీలోకి

కారెక్కనున్న విష్ణువర్ధన్‌రెడ్డి.. సీఎంతో భేటీ

బీఆర్‌ఎస్‌కు ఖమ్మం సెంట్రల్‌ లైబ్రరీ చైర్మన్‌,

వికారాబాద్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రాజీనామా

మాదాపూర్‌/మహబూబ్‌నగర్‌/వికారాబాద్‌/ఖమ్మం కార్పొరేషన్‌/బంజారాహిల్స్‌/హైదరాబాద్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): అధికార బీఆర్‌ఎ్‌సలో చేరికల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ టికెట్లు దక్కని ప్రతిపక్ష పార్టీల నేతలు కారు ఎక్కుతున్నారు. మరోవైపు అధికార బీఆర్‌ఎస్‌ నేతలు కూడా అక్కడక్కడ పార్టీని వీడుతున్నారు. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, పీసీసీ ఉపాధ్యక్షుడు ఎర్రశేఖర్‌ కాంగ్రె్‌సను వీడి బీఆర్‌ఎ్‌సలో చేరారు. జడ్చర్ల, నారాయణపేటల్లో ఏదో ఒక స్థానంలో కాంగ్రెస్‌ టికెట్‌ వస్తుందనే విశ్వాసంలో ఉన్న శేఖర్‌కు రెండు చోట్లా అధిష్ఠానం మొండిచేయి చూపింది. దీంతో ఆదివారం నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డితో కలిసి ప్రగతిభవన్‌కు వచ్చిన శేఖర్‌ తొలుత సీఎం కేసీఆర్‌ను కలిశారు. అనంతరం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్న మాజీ మంత్రి పొడపాటి చంద్రశేఖర్‌ కూడా ఆదివారం సాయంత్రం బీజేపీని వీడి బీఆర్‌ఎ్‌సలో చేరారు.

మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌తో కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లిన ఆయన మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. నాగర్‌కర్నూల్‌ టికెట్‌ దక్కకపోవడంతో కాంగ్రె్‌సకు రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌ రెడ్డిని మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ కలిశారు. ఆదివారం గచ్చిబౌలిలోని నాగం నివాసానికి వెళ్లిన వారు ఆయన్ను బీఆర్‌ఎ్‌సలోకి ఆహ్వానించారు. భేటీ అనంతరం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కూడా నాగం మర్యాద పూర్వకరంగా కలిశారు. నాగర్‌కర్నూల్‌ భవిష్యత్తు కోసమే త్వరలో బీఆర్‌ఎ్‌సలో చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు. పీజేఆర్‌ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి కూడా బీఆర్‌ఎ్‌సలో చేరబోతున్నారు. జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన విష్ణుకు నిరాశే ఎదురైంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవితతో పలుమార్లు భేటీ అయిన ఆయన.. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుతో ఫోన్‌లో చర్చించారు. అనంతరం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ముందుండి పార్టీ నడిపించాలని విష్ణుకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

బీఆర్‌ఎస్‌కు వికారాబాద్‌ మున్సిపల్‌ చైరపర్సన్‌ రాజీనామా..

వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులా రమేశ్‌ బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కేటీఆర్‌కు పంపించారు. వికారాబాద్‌ బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్‌ అరాచకాలు భరించలేక పార్టీలో గౌరవం దక్కకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే త్వరలోనే మంజుల రమేశ్‌ దంపతులు కాంగ్రె్‌సలో చేరబోతున్నట్లు సమాచారం. ఇటు ఖమ్మం సిటీ సెంట్రల్‌ లైబ్రరీ చైర్మన్‌ మహమ్మద్‌ ఆశ్రీఫ్‌ బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేశారు.

Updated Date - 2023-10-30T03:12:23+05:30 IST