గుండెపోటుతో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2023-03-04T03:39:11+05:30 IST
గుండెపోటు కారణంగా అకాల మరణాలు ఇటీవల అధికమయ్యాయి. 20 ఏళ్లు కూడా నిండని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి గుండె ఆగింది. గుండెలో
కాలేజీలో కుప్పకూలిన 18 ఏళ్ల యువకుడు
ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూత
మేడ్చల్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గుండెపోటు కారణంగా అకాల మరణాలు ఇటీవల అధికమయ్యాయి. 20 ఏళ్లు కూడా నిండని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి గుండె ఆగింది. గుండెలో నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిన ఆ యువకుడిని తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోని కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన మేడ్చల్ జిల్లాలోని సీఎంఆర్ కాలేజీలో శుక్రవారం జరిగింది. రాజస్థాన్‌కు చెందిన సచిన్(18) ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ గుండ్లపోచంపల్లిలోని సీఎంఆర్‌ఈసీ కళాశాలలో సీఎ్‌ససీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రోజూలాగే శుక్రవారం కూడా కళాశాలకు వెళ్లాడు. అయితే, మధ్యాహ్నం 1.30గంటల సమయంలో స్నేహితులతో కలిసి కళాశాల నుంచి బయటికి వస్తుండగా సచిన్ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి విద్యార్థులు, కాలేజీ సిబ్బంది సచిన్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రికి వెళ్లే దారిలోనే సచిన్ కన్నుమూశాడు.