ముగిసిన దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2023-06-01T01:01:54+05:30 IST

మండలంలోని దర్వేశిపురం స్టేజీ వద్ద గల రేణుకా ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. అంతకుముందు ఉదయం ఆలయంలో గ వ్యాంత పూజలు, 108 కలశాలతో అష్టోత్తర శతఘటాభిషేకాలు, నీరాజన మంత్రపుష్ప పూజలను ఆలయ ముఖ్యఅర్చకులు నాగోజు మల్లాచారి, శ్రవణ్‌కుమారాచార్యుల అర్చక బృందం నిర్వహించింది.

 ముగిసిన దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు
దర్వేశిపురం ఎల్లమ్మ ఆలయం వద్ద బోనాలతో భక్తులు

ముగిసిన దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు

దర్వేశిపురం,పర్వతగిరి గ్రామస్థుల బోనాలు

కనగల్‌, మే 31: మండలంలోని దర్వేశిపురం స్టేజీ వద్ద గల రేణుకా ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. అంతకుముందు ఉదయం ఆలయంలో గ వ్యాంత పూజలు, 108 కలశాలతో అష్టోత్తర శతఘటాభిషేకాలు, నీరాజన మంత్రపుష్ప పూజలను ఆలయ ముఖ్యఅర్చకులు నాగోజు మల్లాచారి, శ్రవణ్‌కుమారాచార్యుల అర్చక బృందం నిర్వహించింది. చివరి రోజున బుధవారం సాయంత్రం దర్వేశిపురం, పర్వతగిరి గ్రామస్థులు అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. మహిళలు ఆయా గ్రామాల నుంచి కాలినడకన ఆలయం వద్దకు డప్పుచప్పుళ్లు, పోతరాజుల నృత్యాలతో ఊరేగింపుగా తరలివచ్చారు. అనంతరం ఆల యం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇష్టదైవానికి నైవేద్యం సమర్పించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు మాదగోని శ్రీనివా్‌సగౌడ్‌ అమ్మవారిని దర్శించుకుని కలశపూజల్లో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఈవో జయరామయ్య, సర్పంచులు పూలమ్మ, అంజమ్మ, ఎంపీటీసీ శైలజసైదులు, మాజీ చైర్మన్లు గోపాల్‌రెడ్డి, నల్లబోతు యాదగిరి, బీఆర్‌ఎస్‌ నాయకులు అల్గుబెల్లి నర్సిరెడ్డి, శంకర్‌, రామచంద్రం, ఎస్‌ఏ చంద్రయ్య, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T01:01:54+05:30 IST