‘ఉపాధి’ పనులు గుర్తించాలి
ABN , First Publish Date - 2023-03-19T00:41:45+05:30 IST
ఆయకట్టు ప్రాంతంలో కూలీలకు పని కల్పించే విధంగా పనులు గుర్తించాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం వేములపల్లి, మిర్యాలగూడ మండలాల్లో మహత్మగాంఽధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై సమీక్ష నిర్వహించారు. మిర్యాలగూడ మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధిహమీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

కూలీల సంఖ్యను పెంచాలి
సమీక్షలో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
మిర్యాలగూడ, మార్చి 18: ఆయకట్టు ప్రాంతంలో కూలీలకు పని కల్పించే విధంగా పనులు గుర్తించాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం వేములపల్లి, మిర్యాలగూడ మండలాల్లో మహత్మగాంఽధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై సమీక్ష నిర్వహించారు. మిర్యాలగూడ మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధిహమీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మిర్యాలగూడ మండలం ఉపాధి పనుల గుర్తింపులో వెనకబడి ఉందన్నారు. తక్షణమే పనులు గుర్తించి కూలీల సంఖ్య పెంచాలన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఇది ఫైనల్‌కాదని లబ్ధిదారుల ఎంపికలో సమగ్ర విచారణ జరిపి అర్హులకు మాత్రమే ఇళ్లు కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి, ఏపీవోలు శిరీష, వెంకటేశ్వర్లు, వేములపల్లి ఎంపీడీవో దేవిక పాల్గొన్నారు.
పనుల్లో వేగం పెంచాలి
వేములపల్లి: జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా ఉపాధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి ఉపాధి హామీ సిబ్బందితో పని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమీపంలోని నర్సరీని, పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశం, ఎంపీడీవో అజ్మీరా దేవిక, ఎంపీపీ పుట్టల సునీత, సర్పంచ్ చిర్ర మల్లయ్యయాదవ్, ఎంపీవో సంగీత, కార్యదర్శి శ్రవణ్, ఏఈవో నితిన్ తదితరులు పాల్గొన్నారు.
నర్సరీల్లో అన్ని రకాల మొక్కలు పెంచాలి
త్రిపురారం, మార్చి18: నర్సరీల్లో అన్ని రకాల మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ కుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. త్రిపురారం, బాబుసాయిపేట, దుగ్గేపల్లి గ్రామాల్లో వన నర్సరీను ఆమె శనివారం పరిశీలించారు. నర్సరీల నిర్వహణలలో మెలకువలు పాటించి వర్షాకాలం నాటికి మొక్కలు సిద్ధంచేయాలన్నారు. మండల కేంద్రంలోని ఉపాధిహామీ పనుల పరిశీలనకు వెళ్తుండగా మార్గంమధ్యలో కూలీలు ఎదురుకావడంతో సమయం కాక ముందే పని మధ్యలో వెళుతున్నారని అదనపు కలెక్టర్ ప్రశ్నించారు. వర్షం పడుతుండటంతో వెళ్లి పోతున్నామని కూలీలు తెలిపారు. ఆమె వెంట ఎంపీడీవో అలివేలు మంగమ్మ తదితరులున్నారు.