దేశంలో విద్యుత్తు అత్యయిక స్థితి
ABN , First Publish Date - 2023-02-21T03:42:50+05:30 IST
విద్యుత్తు చట్టం-2003లోని సెక్షన్ -11 ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశంలో విద్యుత్తు అత్యయిక పరిస్థితిని మరోసారి విధించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు చట్టం-2003లోని సెక్షన్ -11 ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశంలో విద్యుత్తు అత్యయిక పరిస్థితిని మరోసారి విధించింది. దీని ప్రకారం.. దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్తు కేంద్రాలు పరోక్షంగా కేంద్రప్రభుత్వ నియంత్రణలోకి వె ళతాయి. ఆ కేంద్రాలు ఉత్పత్తి చేసే విద్యుత్తును విధిగా బహిరంగ విపణి(ఓపెన్ యాక్సె్‌స)లో అమ్మాల్సి ఉంటుంది. రానున్న వేసవిలో విద్యుత్తు డిమాండ్ బాగా పెరుగుతుందని.. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో విద్యుత్తు డిమాండ్ 2,29,000 మెగావాట్లకు చేరుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది.