దశాబ్ది ఉత్సవాల పేరిట ఎన్నికల ప్రచారం

ABN , First Publish Date - 2023-06-26T02:27:53+05:30 IST

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజల సొమ్ముతో ఎన్నికల ప్రచారం చేసుకున్నారని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని కొల్లగొడుతోందని ఆరోపించారు. ఈ మేరకు ‘త్యాగం ఎవరిది?

దశాబ్ది ఉత్సవాల పేరిట ఎన్నికల ప్రచారం

8 ‘త్యాగం ఎవరిది ? భోగం ఎవరిది ?’

అనే అంశంపై సమావేశంలో కోదండరాం

పంజాగుట్ట, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజల సొమ్ముతో ఎన్నికల ప్రచారం చేసుకున్నారని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని కొల్లగొడుతోందని ఆరోపించారు. ఈ మేరకు ‘త్యాగం ఎవరిది? భోగం ఎవరిది?(తెలంగాణ సాధనలో త్యాగాలు-భోగాలపై)అనే అంశంపై తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కోదండరాం మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాల్లో ఉద్యమం, అస్థిత్వం, సాధించిన అంశాలు మాట్లాడుకోవడం వదిలేసి ప్రభుత్వ సొమ్ముతో ఎన్నికల ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. ఇలాంటి పాలన దేశంలో ఎక్కడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలు బలంగా రావాలని, సీఎం కేసీఆర్‌ ఇప్పటికైనా స్పందించి అమరుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై పోరాడుదామని మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. సమాఖ్య నాయకులు పాశం యాదగిరి, కరుణాకర్‌ దేశాయ్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు పార్టీలు, సంఘాల నాయకులు, మేధావులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T02:27:53+05:30 IST