ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు కృషి

ABN , First Publish Date - 2023-01-18T00:45:33+05:30 IST

ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నోముల భగత అన్నారు. మంగళవారం త్రిపురారం - బాబుసాయిపేట మధ్యలో ఉన్న వాగుపై రూ.3.50 కోట్లతో నిర్మించే బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు.

 ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు కృషి
వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే భగత

ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు కృషి

త్రిపురారం, జనవరి 17: ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నోముల భగత అన్నారు. మంగళవారం త్రిపురారం - బాబుసాయిపేట మధ్యలో ఉన్న వాగుపై రూ.3.50 కోట్లతో నిర్మించే బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రజల ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన బ్రిడ్జి ఏర్పాటును ప్రభుత్వం సాకారం చేసిందని పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణంతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ధనావత భారతి, ఎంపీపీ అనుముల పాండమ్మ, సర్పంచులు కలగాని శ్రవణ్‌, అనుముల శ్రీనివా్‌సరెడ్డి, మార్కెట్‌ చైర్మన మర్ల చంద్రారెడ్డి, నాయకులు నరేందర్‌, ధనలక్ష్మి, జానయ్య, యాదగిరి శ్రీనివా్‌సయాదవ్‌, రామచంద్రయ్య, రవి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

హాలియా: హాలియా మునిసిపాలిటీలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఎ మ్మెల్యే భగత ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఆకుపూజ, అర్చకు లు చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు మురళీశర్మ, బీఆర్‌ఎస్‌ త్రిపురా రం మండల నాయకులు బోనూతల నరేందర్‌, చెన్నయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-01-18T00:45:34+05:30 IST