హిందూధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలి

ABN , First Publish Date - 2023-06-26T00:48:36+05:30 IST

హిందూ ధర్మ పరిరక్షణ కో సం ప్రతీ ఒక్క హిందువు కృషి చేయాలని భజరంగ్‌దళ్‌ జిల్లా కన్వీనర్‌ కన్నెబోయిన వెంకట్‌ పిలుపునిచ్చారు. పట్టణంలోని గాం ధీపార్కులో ఆదివారం ని ర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

 హిందూధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కన్నెబోయిన వెంకట్‌

హిందూధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలి

రామగిరి, జూన 25: హిందూ ధర్మ పరిరక్షణ కో సం ప్రతీ ఒక్క హిందువు కృషి చేయాలని భజరంగ్‌దళ్‌ జిల్లా కన్వీనర్‌ కన్నెబోయిన వెంకట్‌ పిలుపునిచ్చారు. పట్టణంలోని గాం ధీపార్కులో ఆదివారం ని ర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వి శ్వంలో ఉన్న హిందూ ధ ర్మాన్ని కాపాడటం కోసం మే 1964లో విశ్వహిందూ పరిషత ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత ఏర్పడి వచ్చే ఏడాదికి 60 ఏళ్లు గడుస్తున్నందున జిల్లాలోని ప్రతీ గ్రామంలో విశ్వహిందూ పరిషత కమిటీలు పూర్తి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశ్వహిందూ పరిషత లేని గ్రామం అంటూ ఉండకూడదని ఆ యన కార్యకర్తలకు సూచించారు. హిందువులు ఎలాంటి ఆపదలో ఉన్న విశ్వహిందూ పరిషత ముందు వరుసలో ఉంటుందన్నారు. అదేవిధంగా గో చట్టాన్ని పక్కాగా అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో వీహెచపీఎ్‌స జిల్లా కార్యదర్శి మల్లెబోయిన నరసింహ, నగర అధ్యక్షుడు రాయల కృష్ణయ్య, ఆర్‌ఎ్‌సఎస్‌ జిల్లా కార్యదర్శి బం టు జనార్థన, కోఆర్డినేటర్‌ సంపత, వంశీ, నాగరాజు, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:48:36+05:30 IST