సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేయాలి మావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ సునీత

ABN , First Publish Date - 2023-04-06T23:58:21+05:30 IST

అధికారులు, ప్రజాప్రతినిఽధులు సమన్వయంతో పనిచేస్తూ మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ పుట్టల సునీత అన్నారు.

సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేయాలి  మావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ సునీత
వేములపల్లి : సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ సునీత

సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేయాలి

వేములపల్లి, ఏప్రిల్‌ 6: అధికారులు, ప్రజాప్రతినిఽధులు సమన్వయంతో పనిచేస్తూ మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ పుట్టల సునీత అన్నారు. గురువారం మండలంలోని ఎంపీడీవో కా ర్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్ర స్తుతం వేసవి దృష్ట్యా ప్రతీ గ్రామంలో తాగునీటి సమస్య, విద్యుత కోతలు లేకుండా ఆర్‌డబ్ల్యూఎస్‌, విద్యుత అధికారులు ముందస్తు ప్రణాళికలతో ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. మొల్కపట్నం గ్రామంలో గుర్తించిన లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూం లు అందించేలా రెవెన్యూ అధికారులు చొరవ చూపాలన్నారు. సమా వేశంలో జడ్పీటీసీ ఇరుగు మంగమ్మ, వైస్‌ ఎంపీపీ పాదూరి గోవర్ధ ని, ఎంపీడీవో అజ్మీరా దేవిక, తహసీల్దార్‌ వెంకటేశం, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సురేష్‌, డీఈ సంపత, ఎంపీటీసీలు పల్లా వీరయ్య, నంద్యాల శ్రీరాంరెడ్డి, చైతన్య, గడ్డం రాములమ్మ, లలిత, సర్పంచులు మజ్జిగపు పద్మ, వెంకట్‌రెడ్డి, రాజు, ఝాన్సీ అధికారులు పాల్గొన్నారు.

తూతూమంత్రంగా మండల సభ

శాలిగౌరారం: శాలిగౌరారం మండల పరిషత సర్వసభ్య సమావేశం తూతూమంత్రంగా జరిగింది. అధికారులు, ప్రజాప్రతినిధులు అరకొరగా రావడంతో మండల సభ వెలవెలబోయింది. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 11గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం ఎవరూ రాకపోవడంతో 12 గంటలకు ప్రారంభమైంది. 12 గంటలకు కూడా సర్పంచులు ముగ్గురు, ఎంపీటీసీలు ఆరుగురు, అధికారులు సగం మంది కూడా రాలేదు. జడ్పీటీసీ, మా ర్కెట్‌ కమిటీ చైర్మన, సింగిల్‌విండో చైర్మన, వైస్‌ ఎంపీపీ కూడా హా జరుకాలేదు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు సభ్యులు మాట్లాడుతూ మిషన భగీరథ పైపులైన పనులు పూర్తికాక పలు గ్రామాల్లో మిషన భగీరథ నీరు రాక ప్రజలు నీటికి అల్లాడుతున్నారని పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరయ్యేటట్లు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ గంట లక్ష్మమ్మ ఎంపీడీవో లక్ష్మయ్యను ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్‌ ఎర్ర శ్రీనివా్‌సరెడ్డి, అధికారులు, పలువురు స ర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-06T23:58:21+05:30 IST