బడుగుల అభ్యున్నతికి కృషి

ABN , First Publish Date - 2023-04-03T00:27:51+05:30 IST

సర్దార్‌ సర్వాయి పాపన్న స్ఫూర్తితో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. ఆదివారం సర్దార్‌ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి సర్దార్‌ సర్వాయి పాపన్న ప్రతీక అని కొనియాడారు.

బడుగుల అభ్యున్నతికి కృషి

మంత్రి విద్యుత్‌ శాఖ గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి

సూర్యాపేట(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 2: సర్దార్‌ సర్వాయి పాపన్న స్ఫూర్తితో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. ఆదివారం సర్దార్‌ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి సర్దార్‌ సర్వాయి పాపన్న ప్రతీక అని కొనియాడారు. అన్ని వర్గాలను కలుపుకొని అప్పటి నియంతృత్వ నిరంకుశ శక్తుల కు వ్యతిరేకంగా పాపన్న పోరాడారని గుర్తు చేశారు. ఆత్మగౌరవం కోసం పోరాడిన సర్వాయి పాపన్న స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. త్వరలో సూర్యాపేటలో రూ.2 కోట్లతో గౌడ భవన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అందుకోసం ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు స్థల సేకరణ చేయాలని కలెక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్‌ చైర్మన్‌ పుట్టా కిశోర్‌కుమార్‌, నాయకులు వై.వెంకటేశ్వర్లు, రాపర్తి శ్రీనివా్‌సగౌడ్‌, చింతలపాటి భరత్‌మహాజన్‌, షేక్‌ బాషామియా, బూర బాలసైదులుగౌడ్‌, మారిపెద్ది శ్రీనివా్‌సగౌడ్‌, ఎలిమినేటి అభినయ్‌, బైరు వెంకన్నగౌడ్‌, రామగిరి నగేష్‌, కక్కిరేణి నాగయ్యగౌడ్‌, చింతలపాటి చినశ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.

ఇఫ్తార్‌ విందులు మతసామరస్యానికి ప్రతీకలు

సూర్యాపేట కల్చరల్‌: ఇఫ్తార్‌ విందులు మతసామరస్యానికి ప్రతీకలని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 48వ వార్డులో నూతనంగా నిర్మించిన లతీఫియా మజీద్‌ను ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్టు తెలిపారు. సమాజానికి ఉపయోగపడేలా ఉన్న అల్లా బోధనలను ప్రతీ ఒక్కరు పాటించాలన్నారు. అనంతరం ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు లింగయ్యయాదవ్‌, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, మీరావలీ, వెలుగు వెంకన్న, రియాజ్‌, తాహెర్‌పాషా, సల్మా, అక్తర్‌మౌలానా, గాయాజ్‌, ఖలీ ల్‌, అబ్దుల్‌బారీ, సయ్యద్‌, తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ పాలనతోనే పేదలకు న్యాయం: మంత్రి జగదీ్‌షరెడ్డి

సూర్యాపేట రూరల్‌: బీఆర్‌ఎస్‌ పాలనతోనే పేదలకు న్యాయం జరుగుతోందని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట మండలంలోని తాళ్లఖమ్మంపహాడ్‌లో బీసీ, ఎస్సీ కమ్యూనిటీ హాళ్లను, జిమ్‌ సెంటర్‌ను ప్రారంభించి, గ్రంథాలయానికి శంకుస్థాపన చేశారు. అ నంతరం కాసరబాద ఎక్స్‌రోడ్డు నిర్మించిన బస్టాండ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ పీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వంగాల శ్రీనివా్‌సరెడ్డి, వైస్‌ఎంపీపీ ఆర్‌.శ్రీనివా్‌సనాయుడు, యూత్‌ అధ్యక్షుడు ముదిరెడ్డి సంతో్‌షరెడ్డి, గుడిపూడి వెంకటేశ్వర్‌రావు, మాజీ సర్పంచ్‌ పాముల హనుమంతు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T00:27:51+05:30 IST