సుఖేశ్‌ గుప్తాపై ఈడీ కేసు కొట్టివేత

ABN , First Publish Date - 2023-04-05T02:52:01+05:30 IST

: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయి న ఎంఎంటీసీని మోసం చేశారని, విదేశీ మారక ద్రవ్యం చెల్లింపులో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎంబీఎస్‌ జ్యూయలర్స్‌, ఆ సంస్థ యజమాని సుఖేశ్‌ గుప్తాపై ఈడీ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది.

సుఖేశ్‌ గుప్తాపై ఈడీ కేసు కొట్టివేత

ఎంఎంటీసీని మోసం చేయలేదని హైకోర్టు తీర్పు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయి న ఎంఎంటీసీని మోసం చేశారని, విదేశీ మారక ద్రవ్యం చెల్లింపులో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎంబీఎస్‌ జ్యూయలర్స్‌, ఆ సంస్థ యజమాని సుఖేశ్‌ గుప్తాపై ఈడీ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. డాలర్‌ మారక విలువలో మార్పుల కారణంగా ఏర్పడే బకాయిలను నేరపూరిత నగదుగా పేర్కొనలేమని వ్యాఖ్యానించింది. విదేశీ మారక ద్రవ్య రేట్లలో హెచ్చుతగ్గుల సమయంలో అదనపు సొమ్ము చెల్లించకపోవడం కారణంగా ఎంఎంటీసీకి రూ.220 కోట్ల నష్టం వచ్చిందంటూ సుఖేశ్‌ గుప్తాపై 2013లో సీబీఐ కేసు నమోదు చేసింది. దాని ఆధారంగా ఈడీ కూడా కేసు పెట్టింది. ఈడీ కేసును కొట్టివేయాలని కోరుతూ సుకేశ్‌గుప్తా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌ కె. సురేందర్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. డాలర్‌, రూపాయి మారకం విలువల్లో హెచ్చుతగ్గులతో ఆయన అక్రమాలకు పాల్పడింది ఏమీ లేదంటూ కేసు కొట్టివేస్తూ తుది తీర్పు ఇచ్చింది.

Updated Date - 2023-04-05T02:52:01+05:30 IST