యాదవుల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : కంచర్ల

ABN , First Publish Date - 2023-09-22T00:11:38+05:30 IST

యాదవ కుటుంబాలు ఆర్థికాభివృద్థి చెందేలా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు.

 యాదవుల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : కంచర్ల
కనగల్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న భూపాల్‌రెడ్డి

యాదవుల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : కంచర్ల

నల్లగొండ, కనగ ల్‌, సెప్టెంబరు 21: యాదవ కుటుంబాలు ఆర్థికాభివృద్థి చెందేలా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ, కనగల్‌ మం డలాల్లో గురువారం ని ర్వహించిన ఆయా కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నల్లగొండ మం డలానికి మరో 500 గొర్రెల యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు. గొర్రెల యూ నిట్‌ మంజూరైన నాటి నుంచి గొర్రెల సంపద పెరగడంతో పాటు యాదవులకు ఎంతగానో ఆదాయం పెరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. నల్లగొండకు సీ ఎం కేసీఆర్‌ మంత్రులు కేటీఆర్‌, జగదీ్‌షరెడ్డిలు రూ.1200కోట్లకు పైగా కేటాయిం చి అభివృద్ధి చేయించారని పేర్కొన్నారు. కనగల్‌ మండలంలోని మండలంలోని పర్వతగిరి, బుడమర్లపల్లి గ్రామాల్లో స్వచ్ఛ తాహీ సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలని అ న్నారు. ఇంటిని శుభ్రం చేసుకున్న విధంగానే పరిసరాలను శుభ్రం చేసుకోవాలన్నారు. పరిశుభ్రత వల్ల రోగాలు దరిచేరవన్నారు. అనంతరం మండలంలోని ప లు గ్రామాల్లో గణేష్‌ మండపాలను ఆయన గురువారం సందర్శించారు. ఆయా మండపాల్లో గణపతికి పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు. అంతకుముందు జ డ్పీ చైర్మన బండా నరేందర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన మందడిసైదిరెడ్డి, ఎంపీపీ కరీంపాష, జడ్పీటీసీ వెంకటేశంగౌడ్‌తో కలిసి ఆయన దర్వేశిపురం ఎల్లమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోయినపల్లి గ్రామం లో నిర్మించిన సీసీరోడ్లను, సర్పంచ పగిళ్ల యాదయ్య సహకారంతో గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయా కార్యక్రమా ల్లో పార్టీ అధ్యక్షులు దేప వెంకట్‌రెడ్డి, ఐతగోని యాదయ్యగౌడ్‌, పాక్స్‌ చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్‌, ఎల్లమ్మ ఆలయ చైర్మన అల్గుబెల్లి నర్సిరెడ్డి, మాజీచైర్మన యాదగిరి, ఏపీఎం నరహరి, సీసీలు వసంత, విజయకుమారి, సీవోలు లలిత, సుజాత, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T00:11:38+05:30 IST