ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించాలి
ABN , Publish Date - Dec 29 , 2023 | 11:17 PM
ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించాలని నారాయణపేట డివిజన్ పోలీస్ అధికారి సత్యనారాయణ అన్నారు.
- డీఎస్పీ సత్యనారాయణ
- మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో వార్షిక తనిఖీ
మక్తల్, డిసెంబరు 29 : ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించాలని నారాయణపేట డివిజన్ పోలీస్ అధికారి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్‌స్టేషన్ పరిసరాలు పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న ఫైళ్లను పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. అలాగే విధి నిర్వహణలో పోటీతత్వం ఉండాలని సూచించారు. అంకితభావంతో పనిచేసేవారికి అవార్డులు, రివార్డులు ఇస్తామన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకొని తక్షణమే సేవలందించాలన్నారు. రౌడీలు, సంఘవిద్రోహశక్తులపై నిరంతరం నిఘా ఉంచి వారి కదలికలు గమనించాలన్నారు. దొంగతనాలు నివారిం చేందుకు పెట్రోలింగ్ ఉదృతం చేయాలన్నారు. సమావేశంలో సీఐ రాంలాల్, ఎస్సై పర్వతాలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.