తనిఖీల్లో రూ.40లక్షలు స్వాధీనం
ABN , First Publish Date - 2023-11-21T23:55:26+05:30 IST
ఎన్నికల నేపథ్యంలో తాండూరు నియోజకవర్గంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళవారం ఇద్దరు వ్యక్తులు రూ.40లక్షల నగదును తీసుకె ళ్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

తాండూరు, నవంబరు 21: ఎన్నికల నేపథ్యంలో తాండూరు నియోజకవర్గంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళవారం ఇద్దరు వ్యక్తులు రూ.40లక్షల నగదును తీసుకె ళ్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పెద్దేముల్ మండలం మారేపల్లి సమీపంలోని ఓ కాటన్‌మిల్లు నుంచి యువకులు వినయ్, వీరారెడ్డిలు నగదును తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నట్లు రాజేందర్‌రెడ్డి తెలిపారు. అయితే ఈ డబ్బులను స్ర్కీనింగ్ కమిటీకి అప్పగించామని తెలిపారు.