డీఎస్‌సీ పరీక్ష సిలబస్‌ ఖరారు

ABN , First Publish Date - 2023-09-22T02:48:28+05:30 IST

తెలంగాణ డీఎ్‌ససీ పరీక్షలకు సంబంధించిన సిలబ్‌సను విద్యాశాఖ అధికారులు గురువారం ప్రకటించారు.

డీఎస్‌సీ పరీక్ష సిలబస్‌ ఖరారు

నవంబరులో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు

టెట్‌కు 20 మార్కుల వెయిటేజీ

రాష్ట్ర సిలబ్‌సకు అధిక ప్రాధాన్యత

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ డీఎ్‌ససీ పరీక్షలకు సంబంధించిన సిలబ్‌సను విద్యాశాఖ అధికారులు గురువారం ప్రకటించారు. ఇప్పటికే టెట్‌ పూర్తికాగా నవంబరులో డీఎ్‌ససీ పరీక్ష జరగనుంది. 160 ప్రశ్నలకు ఒక్కోదానికి అర మార్కు చొప్పున మొత్తం 80 మార్కులకు ఈ పరీక్ష జరగనుంది. టెట్‌కు 20 మార్కుల వెయిటేజీ కల్పించారు. ఫలితాలకు మొత్తం వంద మార్కులను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు విడివిడిగా సిలబ్‌సను రూపొందించారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు జనరల్‌ నాలెడ్జీ- కరెంట్‌ అఫైర్స్‌కు 10 మార్కులు. విద్యాదృక్పథాలకు 20, మొదటి లాంగ్వేజీకి 9, ఇంగ్లీషుకు 9, గణితానికి 9, సామాజికశాస్త్రం 9, విజ్ఞానశాస్త్రానికి 9, టీచింగ్‌ మెథడాలజీకి 15 మార్కులను కేటాయించారు. అలాగే స్కూల్‌ అసిస్టెంట్‌, ల్యాంగ్వేజీ పండిట్‌ పోస్టులకు జనరల్‌ నాలెడ్జీ- కరెంట్‌ అఫైర్స్‌కు 10 మార్కులు, విద్యా దృక్పథాలకు 10, కంటెంట్‌కు 44, టీచింగ్‌ మెథడాలజీకి 16 మార్కులను కేటాయించారు.

16 నుంచి టాస్‌ పరీక్షలు: అక్టోబరు 16 నుంచి తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (టాస్‌) పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ పరీక్షలు అక్టోబరు 26వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రాక్టికల్స్‌ను అక్టోబరు 30 నుంచి నవంబరు 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

Updated Date - 2023-09-22T02:48:49+05:30 IST