అస్తవ్యస్తంగా రహదారి పనులు

ABN , First Publish Date - 2023-02-21T01:07:47+05:30 IST

కాంట్రాక్టర్‌, అధికారుల అలసత్వం కారణంగా రహదారులు పనుల అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. పట్టణంలోని వినాయక చౌరస్తా నుంచి నల్లగొండ చౌరస్తా వరకు సుమారు రూ.95లక్షల వ్యయంతో 1.25కిలోమీటర్ల మేర పనులను ఏడాది ఆలస్యంగా ఇటీవల ప్రారంభించారు. పనుల్లో భాగంగా వినాయక చౌరస్తా నుంచి రెడ్డి ఫొటో స్టూడియో వరకు సుమారు 150 మీటర్ల మేర సీసీ రోడ్డును 12రోజుల క్రితం నిర్మించారు. మిగతా పనులను బీటీతో పూర్తి చేస్తారు. అయితే వాటర్‌ క్యూరింగ్‌పైనే సీసీ రోడ్డు మన్నిక ఆధారపడి ఉంటుంది. సీసీ రోడ్డు నిర్మించాక కనీసం 15రోజుల పాటు నీరు నిలువ చేసేలా ఏర్పాట్లు చేస్తారు.

అస్తవ్యస్తంగా రహదారి పనులు

క్యూరింగ్‌ను విస్మరించిన కాంట్రాక్టర్‌

ఎగిరిపడుతున్న కంకరతో ప్రజలకు గాయాలు

భువనగిరి టౌన్‌, ఫిబ్రవరి 20: కాంట్రాక్టర్‌, అధికారుల అలసత్వం కారణంగా రహదారులు పనుల అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. పట్టణంలోని వినాయక చౌరస్తా నుంచి నల్లగొండ చౌరస్తా వరకు సుమారు రూ.95లక్షల వ్యయంతో 1.25కిలోమీటర్ల మేర పనులను ఏడాది ఆలస్యంగా ఇటీవల ప్రారంభించారు. పనుల్లో భాగంగా వినాయక చౌరస్తా నుంచి రెడ్డి ఫొటో స్టూడియో వరకు సుమారు 150 మీటర్ల మేర సీసీ రోడ్డును 12రోజుల క్రితం నిర్మించారు. మిగతా పనులను బీటీతో పూర్తి చేస్తారు. అయితే వాటర్‌ క్యూరింగ్‌పైనే సీసీ రోడ్డు మన్నిక ఆధారపడి ఉంటుంది. సీసీ రోడ్డు నిర్మించాక కనీసం 15రోజుల పాటు నీరు నిలువ చేసేలా ఏర్పాట్లు చేస్తారు. కానీ ఇక్కడ నిర్మిస్తున్న సీసీ రోడ్డు మన్నిక ను కాంట్రాక్టర్‌ గాలికి వదిలివేయడం, పర్యవేక్షించాల్సిన ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో రోడ్డు నాణ్యత, మన్నికపై అనుమానా లు వ్యక్తం అవుతున్నాయి. నిరంతరాయంగా ట్రాఫిక్‌ ఉండే ఈ రహదారిపై 40 టన్నుల బరుతో భారీ వాహనాలు కూడ రాకపోకలు సాగిస్తుంటాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న రహదారి నిర్మాణంలో కనీ స జాగ్రత్తలు తీసుకోవడంలో కాంట్రాక్టర్‌, అధికారు లు విఫలమయ్యారనే విమర్శలు వెలువెత్తుతున్నా యి. అలాగే బీటీ రోడ్డు నిర్మాణం కోసం ఈ రహదారిపై 15రోజుల క్రితం పలు చోట్ల కంకర, డస్టుతో గుంతలను పూడ్చారు. నిబంధనల ప్రకారం బీటీ రోడ్డు నిర్మించే వరకు ఆయా ప్రాంతాల్లో దుమ్ము లేవకుండా కాంట్రాక్టర్‌ రోజువారీగా నీరు చల్లాలి. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నీరు చల్లకపోవడంతో పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోకి దుమ్ము, ధూ ళి చేరి పేరుకుపోతోంది. అలాగే బస్సులు, లారీలు తదితర భారీ వాహనాలు వెళ్తున్న క్రమంలో ఎగిరిపడుతున్న కంకరతో పలువురు గాయాల పాలయ్యా రు. ఆ రహదారి పక్కన ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఇటీవ ల జరిగిన ఓ వివాహానికి దంపతులు బైక్‌పై వస్తుండగా, కంకర ఎగిరి తలపై పడటంతో మహిళ కు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. దీంతో ఆ దంపతులు పెళ్లికి హాజరు కాకుండానే వెనుదిరిగారు. అలాగే మరో నలుగురు ఇదే తరహాలో గాయపడ్డా రు. వాటర్‌ క్యూరింగ్‌, తదితర అంశాలపై ఆర్‌అండ్‌బీ ఏఈఈ సైదులును వివరణ కోరగా, సీసీరోడ్డు నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నామని, వాటర్‌ క్యూరింగ్‌పై కాంట్రాక్టర్‌ను హెచ్చరించామని, బీటీ రోడ్డు పనులు త్వరలో చేపడతామన్నారు.

Updated Date - 2023-02-21T01:07:48+05:30 IST