ఆడపిల్లలపై వివక్ష విడనాడాలి
ABN , Publish Date - Dec 30 , 2023 | 12:10 AM
ఆడపిల్లలపై వివక్ష వి డనాడాలని జిల్లా సాధికారిక కేంద్రం కోఆర్డినేటర్ ఝాన్సీరాణి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రోజా అన్నారు.
ఆడపిల్లలపై వివక్ష విడనాడాలి
చిట్యాలరూరల్, డిసెంబరు 29: ఆడపిల్లలపై వివక్ష వి డనాడాలని జిల్లా సాధికారిక కేంద్రం కోఆర్డినేటర్ ఝాన్సీరాణి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రోజా అన్నారు. భవిష్యత్తు తరాలు మ నుగడ సాగాలంటే ప్రతి ఇంటా ఆడపిల్లల్ని పుట్టనిద్దామని, వా రిని ఎదగనిద్దామని, మంచి చదువును చదవనివ్వాలని అన్నా రు. ‘బేటీ బచావో - బేటీ పడావో’ కార్యక్రమాన్ని శుక్రవారం మండలంలోని వనిపాకల గ్రామంలో నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవగాహన నిర్వహించి ప్ర తిజ్ఞ చేయించి మానవహారాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సమాజంలో ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలని, తన కాళ్లపై తను నిలబడి అందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు. ముందుగా బాల్య వివాహాలను అరికట్టాలని, ఆడపిల్లలపై వివక్షను రూపుమాపాలన్నారు. ఆకతాయిల రక్షించుకునేందుకు స్వీయరక్షణలో మెళకువలను నేర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సైదులు, బాణాల శీనయ్యచారి, ఉపాధ్యాయులు, అంగనవాడీ టీచర్లు సునీత, మేడి జానకమ్మ, ఇందిర, అరుణ, అపర్ణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.