ఢిల్లీ మద్యం కేసులో దినేశ్ అరోరాకు బెయిలు
ABN , First Publish Date - 2023-08-02T04:09:17+05:30 IST
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్టయిన వ్యాపారవేత్త దినేశ్ అరోరాకు రౌజ్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్టయిన వ్యాపారవేత్త దినేశ్ అరోరాకు రౌజ్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జూలై 6న ఆయనను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను విచారించిన ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్ బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.