చేపలు పట్టేందుకు వెళ్లి మృతి

ABN , First Publish Date - 2023-06-03T01:08:25+05:30 IST

చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

చేపలు పట్టేందుకు వెళ్లి మృతి
నాగరాజు

చేపలు పట్టేందుకు వెళ్లి మృతి

నల్లగొండ, జూన 2: చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మాడ్గులపల్లి మండలం పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన అంబటి నాగరాజు(35) బతుకు దెరువు కోసం కుటుంబసభ్యులతో కలిసి నల్లగొండకు వచ్చి కొంతకాలంగా పానగల్‌లో నివాసముంటూ చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం చేపలు పట్టేందుకు ఉదయ సముద్రం చెరువుకు వెళ్లిన నాగరాజు తెప్పతో చెరువు మధ్యలోకి వెళ్లగానే ఒక్కసారిగా ఈదురుగాలులు రావడంతో తెప్ప తిరగబడి చెరువులో పడిపోయాడు. అతికష్టం మీద ఈదుకుంటూ ఒడ్డుకు చేరేందుకు నాగరాజు ప్రయత్నించినా మరోమారు బలమైన ఈదురుగాలులు వీచడంతో చెరువులో మునిగి మృతి చెందాడు. ఈ విషయాన్ని గమనించిన తోటి జాలర్లు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని మృతదేహం కోసం గాలింపులు చేపట్టారు. అయితే గురువారం సాయంత్రం వరకు గాలింపులు చేపట్టినా మృతదేహం లభించలేదు. రాత్రి కావడంతో గాలింపు నిలిపివేశారు. శుక్రవారం ఉదయం మృతదేహం చెరువులో తేలడంతో స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. నాగరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ప్రశాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-06-03T01:08:25+05:30 IST