ఎన్నికల ఖర్చు వివరాలు అందజేయాలి
ABN , Publish Date - Dec 29 , 2023 | 11:19 PM
తెలంగాణ శాసన సభ ఎన్నికలకు సంబంధించి నారాయణపేట జిల్లాలోని మక్తల్, పేట సెగ్మెంట్‌లకు పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బుల లెక్కల వివరాలను రెండ్రో జుల్లో అందించాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు అభిషేక్ దేవల్ కోరారు.
- ఎన్నికల వ్యయ పరిశీలకుడు అభిషేక్ దేవల్
నారాయణపేట టౌన్, డిసెంబరు 29: తెలంగాణ శాసన సభ ఎన్నికలకు సంబంధించి నారాయణపేట జిల్లాలోని మక్తల్, పేట సెగ్మెంట్‌లకు పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బుల లెక్కల వివరాలను రెండ్రో జుల్లో అందించాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు అభిషేక్ దేవల్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్గో గెలుపొందిన వారితో పాటు పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చులకు సంబంధించి అన్ని వివరాల రికార్డులను సమర్పించాలని వాటితో పాటు బ్యాంకు స్టేట్‌మెంట్, ప్రచార ఖర్చులను అందించాలన్నారు. తాము వచ్చేనెల 2న ఎన్నికల కమిషన్‌కు నివేదికను పంపిస్తామన్నారు. చివరి రోజు వరకు వేచి చూడకుండా వెంటనే జిల్లా ఎన్నికల అధికారులకు ఖర్చుల వివ రాలను అందించాలని కోరారు. పేట సెగ్మెంట్‌లో ఏడుగురు, మక్తల్ సెగ్మెంట్‌లో 11 మంది అభ్యర్థులు పోటీ చేశారని ఈ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ప్రధాన రాజకీయ పార్టీల నాయకులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించాలన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే 90 శాతం ఎన్నికల ఖర్చు వివరాలను ఇచ్చారని ఇంకా కొందరు స్వతంత్ర అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు వివరాలు అందిం చ లేదని, అలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ మాట్లాడుతూ ఎన్నికల నామినేషన్ నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు అభ్యర్థులు తాము చేసిన ఖర్చుల వివరాలను రెండ్రోజుల్లో తప్పక ఇవ్వాలని కోరారు. వివరాలు ఇవ్వని పక్షంలో తమ సభ్యత్వం కోల్పోవడంతో పాటు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని ఆయన తెలిపారు. గెలిచిన అభ్యర్థులు అందించిన ఖర్చుల వివరాలలో ఒకటి రెండు ఓచర్లు తక్కువగా ఉన్నాయని, ఎన్నికల ముందు ఇచ్చిన పార్ట్ ఏ, బీ, సీ రికార్డులను సమర్పించాలని ఆయన కోరారు. లేని పక్షంలో ఆర్‌టీ యాక్ట్ 1950 రూల్ 10 ప్రకారం డిస్ క్వాలిఫై అవుతుందన్నారు. ఎన్నికల ఖర్చు లెక్కలను పరిశీలించి లోటు పాట్లను సరి చేసేందుకు కలెక్టరేట్‌లో అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్, ఆర్డీవో రాంచందర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.