‘దశాబ్ది’ దోపిడీని నిలదీయాలి : బీఎస్పీ

ABN , First Publish Date - 2023-06-03T01:10:42+05:30 IST

దశాబ్ద కాలం దోపిడీకి నిరసనగా 20 రో జుల పాటు పాలకులపై ప్రశ్నల వర్షం కురిపించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి పెద్దవూర మండలం రామన్నగూడెంతండాలో విలేకరులతో మాట్లాడారు. అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో తొమ్మిదేళ్లపాటు మోసపోయిందన్నారు.

  ‘దశాబ్ది’ దోపిడీని నిలదీయాలి : బీఎస్పీ
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ప్రవీణ్‌కుమార్‌

‘దశాబ్ది’ దోపిడీని నిలదీయాలి : బీఎస్పీ

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌

పెద్దవూర, తిరుమలగిరి(సాగర్‌), జూన 2: దశాబ్ద కాలం దోపిడీకి నిరసనగా 20 రో జుల పాటు పాలకులపై ప్రశ్నల వర్షం కురిపించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి పెద్దవూర మండలం రామన్నగూడెంతండాలో విలేకరులతో మాట్లాడారు. అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో తొమ్మిదేళ్లపాటు మోసపోయిందన్నారు. కేసీఆర్‌ మాటల ముఖ్యమంత్రి అని, ప్రస్తుత ప్రభుత్వం ఘరానా దొంగలను వెనకేసుకుందని విమర్శించారు. పేదల భూములను లాక్కొని ధనవంతులకు అప్పగిస్తున్నాడ ని ఆరోపించారు. గిరిజనుల 10శాతం రిజర్వేషన కాగితాలపైనే ఉం దని, గిరిజన యూనివర్సిటీ రాలేదని, పోడు భూముల గురించి కేసీఆర్‌ ఊరిస్తున్నాడేగానీ పని అవడం లేదన్నారు. గిరిజన బిడ్డల గోస కేసీఆర్‌కు పట్టడం లేదన్నారు. ఇటువంటి దోపిడీ ప్రభుత్వాన్ని తొలగించి బహుజన ప్రభుత్వానికి పట్టంకట్టాలని ప్రజలను కోరారు. గిరిజనుల రిజిర్వేషన్లు, పోడు భూ ముల పట్టాలు ఏమయ్యాయని, సీఎం కార్యాలయంలో ఒక్క గిరిజన అఽధికారి లేకపోవడం ఈ ప్రభుత్వానికి గిరిజనులపై ఉన్న ప్రేమకు నిదర్శనమని అన్నారు. బీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వం కూడా ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. తిరుమలగిరి(సాగర్‌) మండలంలోని రంగుండ్ల తండాలో సేవాసాదు ఆలయంలో నిర్వహిస్తున్న పెద్దపూజలో బీఎ స్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు. బంజారా, గిరిజన బావోజీలు, పూజారుల నేతృత్వంలో ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వివిధ జిల్ల్లాల నుంచి వచ్చి భక్తులతో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఆదిమళ్ల వెంకటేశ్వర్లు, పోలెపల్లి రాజేష్‌, తంగెళ్ల సత్యనారాయణరాజు, బత్తుల ప్రసాద్‌, ముదిగొండ వెంకటేశ్వర్లు, రమే్‌షరాథోడ్‌, తెల్కపల్లి సైదులు, బైరాగి విజయ, కుక్కమూడి ముత్యాలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T01:10:42+05:30 IST