ఆగి ఉన్న కంటెయినర్‌ను ఢీకొన్న డీసీఎం
ABN , First Publish Date - 2023-07-21T00:40:02+05:30 IST
రహదారిపై ఆగి ఉన్న కంటెయినర్ లారీని డీసీఎం ఢీకొనడంతో ఒకరికి గాయాలయ్యాయి.
డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
చిట్యాలరూరల్, జూలై 20: రహదారిపై ఆగి ఉన్న కంటెయినర్ లారీని డీసీఎం ఢీకొనడంతో ఒకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి శివారులో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కంటెయినర్ లారీ హైదరాబాద్‌కు వెళుతుండగా గుండ్రాంపల్లి శివారులో బతుకమ్మ చెరువు సమీపంలో మరమ్మత్తుల కోసం రోడ్డు పక్కన నిలిపాడు. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న డీసీఎం రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటెయినర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్ ముజఫర్‌ఖాన్‌కు రెండు కాళ్లు విరిగాయి. దీంతో ఆయన క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. గమనించిన వాహనదారులు, స్థానికులు, పోలీసులు ఆయనను బయటకు తీశారు. చికిత్స నిమిత్తం జీఎంఆర్‌కు చెందిన 1033 ఆంబులెన్స్‌లో చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చిట్యాల ఎస్‌ఐ ఇ. రవి తెలిపారు.
జాతీయ రహదారిపై మూడు కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌జాం
డీసీఎం, కంటెయినర్ లారీని ఢీకొట్టడంతో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రమాద స్థలి నుంచి గుండ్రాంపల్లి శివారు నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమీపం వరకు రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. అక్కడే ఉన్న యూటర్న్ నుంచి వాహనాలు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే మార్గంలో వన్‌వేలో హైదరాబాద్ వైపునకు వాహనాలు మళ్లడంతో హైదారాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలతో ట్రాఫిక్‌జాం అయిం ది. డీసీఎంను రోడ్డుపై నుం చి పక్కకు తొలగించేందుకు సమయం పట్టడంతో జాతీ య రహదారిపై ఇరువైపులా సుమా రు మూడు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. నార్కట్‌పల్లి సీఐ మహేష్, చిట్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరు కొని డీసీఎంను పక్కకు జరిపి రహదారిపై ట్రాఫి క్‌ను క్రమబద్ధీకరించారు.