బీఆర్‌ఎస్‌కు డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి గుడ్‌ బై!

ABN , First Publish Date - 2023-10-06T03:49:07+05:30 IST

వికారాబాద్‌ డీసీసీబీ చైర్మన్‌ బి.మనోహర్‌రెడ్డి (బీఎంఆర్‌) బీఆర్‌ఎ్‌సకు షాక్‌ ఇచ్చారు. ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన శుక్రవారం కాంగ్రె్‌సలో చేరుతున్నారు. బీఎంఆర్‌ పరిగి అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించారు.

బీఆర్‌ఎస్‌కు డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి గుడ్‌ బై!

నేడు ఢిల్లీలో అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక

ఎమ్మెల్సీ కసిరెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కూడా..

పరిగి/ఆమనగల్లు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ డీసీసీబీ చైర్మన్‌ బి.మనోహర్‌రెడ్డి (బీఎంఆర్‌) బీఆర్‌ఎ్‌సకు షాక్‌ ఇచ్చారు. ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన శుక్రవారం కాంగ్రె్‌సలో చేరుతున్నారు. బీఎంఆర్‌ పరిగి అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించారు. అయితే సిటింగ్‌ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డికే టికెట్‌ ఇస్తామని పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించడంతో అసంతృప్తితో ఉన్నారు. ఈక్రమంలోనే కాంగ్రె్‌సలో చేరేందుకు ఆయన పావులు కదిపారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో పలుమార్లు భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ బీఎంఆర్‌కు తాండూరు టికెట్‌ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ సమక్షంలో బీఎంఆర్‌ కాంగ్రె్‌సలో చేరతారని సమాచారం. కాగా, ఇక ఇప్పటికే బీఆర్‌ఎ్‌సను వీడిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్‌ జడ్పీ వైస్‌చైర్మన్‌ బాలాజీ సింగ్‌ కూడా శుక్రవారం కాంగ్రె్‌సలో చేరనున్నారు. వారితో పాటు ఆమనగల్లు ఎంపీపీ అనితా విజయ్‌, కడ్తాల ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌, కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కూడా కాంగ్రె్‌సలో చేరేందుకు ఢిల్లీ వెళ్తున్నారు.

Updated Date - 2023-10-06T03:49:13+05:30 IST