దళితబంధు పథకం భేష్‌

ABN , First Publish Date - 2023-06-18T00:01:57+05:30 IST

దళితబంధు పథకం భేష్‌ అని పంజాబ్‌ సామాజిక న్యాయం, అల్పా సంఖ్యాకవర్గ శాఖ మంత్రి బాల్జీత్‌కౌర్‌ అన్నారు. తుర్కపల్లి మండలంలోని సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిని పంజాబ్‌ రాష్ట్ర ఉన్నతాధికారులు జి.రమేశ్‌కుమార్‌, జస్‌ప్రీత్‌సింగ్‌, స్టేట్‌ నోడల్‌ ఆఫీసర్‌ అశీ్‌షకతూరియా, పంజాబ్‌ రాష్ట్ర ఇన్‌చార్జి జగదీ్‌షశర్మతో కలిసి శనివారం ఆమె సందర్శించారు.

దళితబంధు పథకం భేష్‌

పంజాబ్‌ సామాజిక న్యాయం, అల్పా సంఖ్యాకవర్గ శాఖ మంత్రి బాల్జీత్‌కౌర్‌

సీఎం దత్తత గ్రామం వాసాలర్రిలో మంత్రి పర్యటన

దళితబంధు యూనిట్లపై అధ్యయనం

తుర్కపల్లి, జూన్‌ 17: దళితబంధు పథకం భేష్‌ అని పంజాబ్‌ సామాజిక న్యాయం, అల్పా సంఖ్యాకవర్గ శాఖ మంత్రి బాల్జీత్‌కౌర్‌ అన్నారు. తుర్కపల్లి మండలంలోని సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిని పంజాబ్‌ రాష్ట్ర ఉన్నతాధికారులు జి.రమేశ్‌కుమార్‌, జస్‌ప్రీత్‌సింగ్‌, స్టేట్‌ నోడల్‌ ఆఫీసర్‌ అశీ్‌షకతూరియా, పంజాబ్‌ రాష్ట్ర ఇన్‌చార్జి జగదీ్‌షశర్మతో కలిసి శనివారం ఆమె సందర్శించారు. గ్రామంలో అమలు చేసిన దళితబంధు పథకం లబ్ధిదారులు నివసిస్తున్న కాలనీల్లో పర్యటించి పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 75 దళిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.7.50కోట్లు మంజూరు చేసింది. దళితబంధు నిధులతో లబ్ధిదారులు కొనుగోలు చేసిన వాహనాలను, ఏర్పాటు చేసిన కిరాణం దుకాణాలు, తదితర యూనిట్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ పథకం అమలుకు ముందు లబ్ధిదారుల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఎవరెవరు ఏ పనులు చేసే వారు? ఎంత సంపాదించేవారని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో తామంతా కూలీలుగా, ప్రైవేట్‌ కంపెనీల్లో కార్మికులుగా, డ్రైవర్లుగా పనిచేసి నెలకు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు సంపాదించేవారమని లబ్ధిదారులు ఈ సందర్భంగా వారికి వివరించారు. దళితబంధు వచ్చిన తర్వాత ఆనందంగా ఉన్నామని వివరించారు. ఈ పథకం ద్వారా వచ్చిన నిధులతో యూనిట్లు కొనుగోలు చేసి సొంతంగా పనిచేసుకుంటూ నెలకు రూ.25వేల నుంచి రూ.40వేల వరకు సంపాందిస్తున్నామని, రూ.5లక్షల వరకు బ్యాంకు ల్లో జమ చేశామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీ, రాష్ట్ర షెడ్యూల్‌, కులాల అభివృద్ధి అధికారి కిషన్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్యాంసుందర్‌, ఎంపీడీవో ఉమాదేవి, సర్పంచ్‌ పోగుల ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-18T00:01:57+05:30 IST