‘దళిత బంధు’ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే

ABN , First Publish Date - 2023-09-04T04:21:11+05:30 IST

బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే ‘దళితబంధు’ ఇస్తున్నారని.. అర్హులైన నిరుపేదలను విస్మరిస్తున్నారని ఆరోపిస్తూ ఆదివారం మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాలలో దళితులు వాటర్‌ట్యాంక్‌ ఎక్కి ఆందోళన చేపట్టారు.

‘దళిత బంధు’ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే

స్పష్టం చేసిన రావిరాల సర్పంచ్‌

వాటర్‌ట్యాంక్‌ పైకి ఎక్కి దళితుల నిరసన

నెల్లికుదురు(మహబూబాబాద్‌ జిల్లా), సెప్టెంబరు 3 : బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే ‘దళితబంధు’ ఇస్తున్నారని.. అర్హులైన నిరుపేదలను విస్మరిస్తున్నారని ఆరోపిస్తూ ఆదివారం మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాలలో దళితులు వాటర్‌ట్యాంక్‌ ఎక్కి ఆందోళన చేపట్టారు. రావిరాల గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ ఉబ్బని అనిల్‌ సమక్షంలో ఆదివారం దళితబంధు పథకం కోసం లబ్ధిదారుల ఎంపిక నిర్వహిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన కొంతమంది దళితులు తమను ఎంపిక చేయాలని సర్పంచ్‌ను కోరారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలనే దళిత బంధు పథకానికి ఎంపిక చేస్తామని సర్పంచ్‌ తెలపడంతో వారు ఆగ్రహించారు. 20 మంది దళితులు రావిరాలలోని వాటర్‌ట్యాంక్‌ ఎక్కి రెండు గంటల పాటు ఆందోళన చేశారు. ఈ విషయాన్ని గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడంతో ట్యాంక్‌పై నుంచి ఆందోళనకారులు కిందకు దిగారు.

Updated Date - 2023-09-04T04:21:11+05:30 IST