నల్లగొండలో కార్డన సెర్చ్‌

ABN , First Publish Date - 2023-06-26T00:50:28+05:30 IST

నల్లగొండ జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ సమీపంలోని సతీ్‌షనగర్‌లో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డనసెర్చ్‌ నిర్వహించారు. ఎస్పీ అపూర్వరావు ఆదేశాల మేరకు డీఎస్పీ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కార్డనసెర్చ్‌ నిర్వహించారు.

 నల్లగొండలో కార్డన సెర్చ్‌
కార్డనసెర్చ్‌లో గుర్తించిన అనుమానితులతో పోలీసులు

నల్లగొండలో కార్డన సెర్చ్‌

బస్టాండ్‌ సమీపంలోని సతీ్‌షనగర్‌లో ఏకకాలంలో దాడులు

32 మంది అనుమానితులు

24 ద్విచక్ర వాహనాలు

20 సెల్‌ఫోన్లు స్వాధీనం

నల్లగొండ టౌన, జూన 25: నల్లగొండ జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ సమీపంలోని సతీ్‌షనగర్‌లో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డనసెర్చ్‌ నిర్వహించారు. ఎస్పీ అపూర్వరావు ఆదేశాల మేరకు డీఎస్పీ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కార్డనసెర్చ్‌ నిర్వహించారు. పోలీస్‌ అధికారులు తమ సిబ్బందితో సుమారు 3.30 గంటల నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కాలనీలోని ప్రతీ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గతంలో చోరీలకు పాల్పడిన ఒక వ్యక్తి, 32 మంది అనుమానితులు, అనుమతి పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు, 20 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీ్‌సస్టేషనకు తరలించారు. కార్యక్రమం లో టూటౌన, వనటౌన, మహిళా పోలీ్‌సస్టేషన్ల సీఐలు పీఎనడీ ప్రసాద్‌, రౌతు గోపి, ఆదిరెడ్డి, ఎస్‌ఐలు రాజశేఖర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, సంపత, సైదు లు, సందీ్‌పరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:50:28+05:30 IST