Share News

ఉద్యమకారులను గుర్తించిన కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2023-12-11T00:30:46+05:30 IST

ఎన్నో పోరాటాలు చేసి స్వరాష్ట్రం సాధించిన మలిదశ ఉద్యమకారులను కాంగ్రెస్‌ ప్రభుత్వం తగిన గుర్తింపు నిచ్చిందని మలిదశ ఉద్యమకారుల సంఘం మండల అధ్యక్షుడు కాటం వెంకటేశం అ న్నారు.

 ఉద్యమకారులను గుర్తించిన కాంగ్రెస్‌
చిట్యాలలో విలేకరులతో మాట్లాడుతున్న కాటం వెంకటేశం

ఉద్యమకారులను గుర్తించిన కాంగ్రెస్‌

చిట్యాల, డిసెంబరు 10: ఎన్నో పోరాటాలు చేసి స్వరాష్ట్రం సాధించిన మలిదశ ఉద్యమకారులను కాంగ్రెస్‌ ప్రభుత్వం తగిన గుర్తింపు నిచ్చిందని మలిదశ ఉద్యమకారుల సంఘం మండల అధ్యక్షుడు కాటం వెంకటేశం అ న్నారు. చిట్యాలలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పింఛన ఇస్తామని ప్రకటించి ఉద్యమకారులను గౌరవించిందన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు భంగపాటే మిగిలిందని, తమకు సరైన ప్రాధాన్యత లభించలేదన్నారు. పదవి లేకున్నా నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉద్యమకారులకు అండగా నిలిచారని తెలిపారు. కాం గ్రెస్‌ ప్రభుత్వం ఉద్యమకారుల్లో ఆత్మవిశ్వాసం నింపిందన్నారు. కార్యక్రమంలో నాయకులు కోనేటి యాదగిరి, జక్కల మల్లేషం, గోలి మహేష్‌, కురాకుల సురేష్‌, సాగర్ల నరేష్‌, చిర్రగోని గణేష్‌, అరూరి పాండు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-11T00:30:48+05:30 IST