కర్ణాటకలా తెలంగాణలో కాంగ్రె్‌సదే అధికారం
ABN , First Publish Date - 2023-11-10T04:15:18+05:30 IST
కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ కాంగ్రెస్ విజయం సాధించి అధికారాన్ని చేపట్టడం ఖాయమని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్
టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్‌గా తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ కాంగ్రెస్ విజయం సాధించి అధికారాన్ని చేపట్టడం ఖాయమని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ. వేణుగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకూల వాతావరణం ఏర్పడిందని చెప్పారు. తమ పార్టీ నాయకులంతా ఏకతాటిపై నిలబడి కలిసి కట్టుగా పని చేస్తున్నారని వేణుగోపాల్ కొనియాడారు. మరోవైపు టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్‌గా చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) నియమితులయ్యారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆమోదం మేరకు తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్‌గా నియమించినట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు.