Manchiryāla- కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
ABN , Publish Date - Dec 28 , 2023 | 10:21 PM
కాంగ్రెస్ పార్టీ ఆవిర్బావ వేడుకలను గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణాధ్యక్షుడు తూముల నరేష్ జెండాను ఎగురవేశారు.
ఏసీసీ, డిసెంబరు 28 : కాంగ్రెస్ పార్టీ ఆవిర్బావ వేడుకలను గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణాధ్యక్షుడు తూముల నరేష్ జెండాను ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి , పట్టణాధ్యక్షుడు తూముల నరేష్, పెంట రజిత, హేమలత, సదానందం తదితరులు పాల్గొన్నారు.
మందమర్రిటౌన్: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను గురువారం మందమర్రిలోని మార్కెట్ సెంటర్‌లోని సంజయ్‌గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు నోముల ఉపేందర్‌గౌడ్, సీనియర్ నాయకుడు సొత్కు సుదర్శన్‌లు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మంద తిరుమల్, శ్రీనివాస్, షకీల్, శివకు మార్, రాజు, అర్జున్‌కుమార్, కిరణ్ ,మల్లేశ్వరి, పద్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చెన్నూరు: చెన్నూరు పట్టణం, మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్‌లోని అంబేద్కర్ విగ్రహం ముందు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. నాయకులు సుధాకర్‌రెడ్డి, నారాయణ, రాజమల్లగౌడ్, శ్రీధర్ , కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
జైపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలను గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఫయాజ్, రాజన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
జన్నారం: మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా నాయకులు ఏనుగు సుభాష్‌రెడ్డి, దుమల్ల రమేష్‌లు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మోహన్‌రెడ్డి, పసివుల్లా, రాజన్న, రియాజుద్దీన్, నందునాయక్, ఇందయ్య, రజాక్, గంగన్న, రాజేష్, ప్రవీణ్, ముజ్జు, మహేష్, నర్సింగారావు తదితరులు పాల్గొన్నారు.