రెండో రోజూ కాంగ్రెస్‌ ఆందోళన

ABN , First Publish Date - 2023-03-26T02:23:14+05:30 IST

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు రెండో రోజు శనివారం ఆందోళనలకు దిగాయి.

రెండో రోజూ కాంగ్రెస్‌ ఆందోళన

ముషీరాబాద్‌లో మోదీ దిష్టిబొమ్మ దహనం

బీజేపీ కార్యాలయం వద్ద మహిళా కాంగ్రెస్‌ ఆందోళన

ముషీరాబాద్‌/అఫ్జల్‌గంజ్‌/మహబూబ్‌నగర్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు రెండో రోజు శనివారం ఆందోళనలకు దిగాయి. ముషీరాబాద్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. రాహుల్‌పై వేటు అప్రజాస్వామికం అని అన్నారు. అన్యాయాలపై ప్రశ్నించే గొంతుకలను అణచివేసే ధోరణిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆలిండియా కాంగ్రెస్‌ ఫిషర్‌మెన్‌ కమిటీ ఆధ్వర్యంలో పార్సిగుట్ట చౌరస్తాలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని కమిటీ కార్యదర్శి బిజ్జి శత్రు ధ్వజమెత్తారు. ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో రాజా డీలక్స్‌ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రె్‌సకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక రాహుల్‌గాంధీపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి నల్లవెల్లి అంజిరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు, యూత్‌ కాంగ్రెస్‌ నేత రోహిత్‌ ఆధ్వర్యంలో గాంధీభవన్‌ నుంచి ర్యాలీగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. మరోవైపు.. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు, టీఎ్‌సపీఎస్సీ పేపర్‌ లీకేజీల ఘటనలకు నిరసనగా ఎన్‌ఎ్‌సయూఐ, డీసీసీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో ఆందోళన చేపట్టారు. డీసీసీ కార్యాలయం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ ధోరణికి గుణపాఠం తప్పదనిహెచ్చరించారు.

Updated Date - 2023-03-26T02:23:14+05:30 IST