Share News

యాదాద్రిలో భక్తుల కోలాహలం

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:36 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు ఆదివారం పెద్దఎత్తున తరలివచ్చారు. కొండపైన ఆలయ తిరువీధులు, స్వామివారి ఉభయ దర్శనాల క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి.

యాదాద్రిలో భక్తుల కోలాహలం

శాస్త్రోక్తంగా మొదలైన ధనుర్మాస ఉత్సవాలు

యాదగిరిగుట్ట రూరల్‌, డిసెంబరు 17: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు ఆదివారం పెద్దఎత్తున తరలివచ్చారు. కొండపైన ఆలయ తిరువీధులు, స్వామివారి ఉభయ దర్శనాల క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ధర్మదర్శనాలకు మూడు గంటలు, ప్రత్యేక దర్శనాలకు రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామికి నిత్య పూజలు ఘనంగా కొనసాగాయు. వివిధ విభాగాల నుంచి ఆదివారం ఆలయ ఖజానాకు రూ.54,09,081ల ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా కొండపైన అమ్మవారికి తిరుప్పావై కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆర్టీసీ బస్సులు సరిపడక భక్తులు ఇబ్బంది పడ్డారు.

Updated Date - Dec 18 , 2023 | 06:45 AM