Share News

వ్యాపారులకు పూర్తి స్వేచ్ఛ

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:08 PM

వ్యాపారులు తమ వ్యాపారాన్ని స్వేచ్ఛగా చేసుకునేందుకు తనవంతు పూర్తి సహకారం ఉంటుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి చెప్పారు. ఆదివారం తాండూరు పట్టణం రిక్రియేషన్‌ క్లబ్‌లో క్లబ్‌ సభ్యులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు.

వ్యాపారులకు పూర్తి స్వేచ్ఛ

ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

తాండూరు, డిసెంబరు 17: వ్యాపారులు తమ వ్యాపారాన్ని స్వేచ్ఛగా చేసుకునేందుకు తనవంతు పూర్తి సహకారం ఉంటుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి చెప్పారు. ఆదివారం తాండూరు పట్టణం రిక్రియేషన్‌ క్లబ్‌లో క్లబ్‌ సభ్యులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత తనదని చెప్పారు. రిక్రియేషన్‌ సెంటర్‌ అభివృద్ధ్దికి తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. విద్యా, వైద్య రవాణాపై ప్రత్యేక చొరవ చూపెట్టాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. అందరి సహకరంతో తాండూరు ఎమ్మెల్యేగా తాను గెలవడంతో పాటు పక్క నియోజకవర్గం కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు. ఐదేళ్లలో తాండూరు నియోజకవర్గం ఊహించని అభివృద్ది చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు పటేల్‌ శ్రీశైలం, క్లబ్‌ ప్రతినిఽధులు ఓం ప్రకాష్‌, నాగారం నర్సింహులు, గాజీపూర్‌ నారాయణరెడ్డి, దినే్‌షసింగ్‌, జడ్‌పిటిసి ధారాసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:09 PM