సత్వరమే ఫిర్యాదులను పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:06 PM
సత్వరమే ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు.
- నారాయణపేట కలెక్టర్ శ్రీహర్ష
నారాయణపేట టౌన్, డిసెంబరు 18: సత్వరమే ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం నారా యణపేట కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదుదారులకు తప్పని సరిగా సమాచారం ఇవ్వాలని ఆదే శించారు. ప్రజావాణి సైట్‌లో పూర్తి వివరాలు అప్‌లోడ్ చేయాలని సూ చించారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిబంధనల మేరకు ఇటుక బట్టీలను ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ నిబంధనల మేరకు ఇటుక బట్టీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నారాయణపేట జిల్లాలోని ఇటుక బట్టీల యజమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలను ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బట్టీల నిర్వహణకు సంబంధించి పలు అంశాలను కలెక్టర్ వివరించారు. సమావేశంలో కార్మికశాఖ అధికారి రాజ్‌కుమార్ , ఇటుక బట్టీల యజమానులు పాల్గొన్నారు.