సాయుధ పోరాటానికి కమ్యూనిస్టులే వారసులు : సారంపల్లి

ABN , First Publish Date - 2023-09-18T01:14:23+05:30 IST

తెలంగాణ రైతాంగ సాయుధపోరాటానికి కమ్యూనిస్టులే నిజమైన వారసులు అని అఖిల భారత కిసాన సంఘ్‌ జాతీయ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు.

 సాయుధ పోరాటానికి కమ్యూనిస్టులే వారసులు : సారంపల్లి
ర్యాలీలో అభివాదం చేస్తున్న సారంపల్లి మల్లారెడ్డి, జూలకంటి

సాయుధ పోరాటానికి కమ్యూనిస్టులే వారసులు : సారంపల్లి

మిర్యాలగూడ, సెప్టెంబరు 17: తెలంగాణ రైతాంగ సాయుధపోరాటానికి కమ్యూనిస్టులే నిజమైన వారసులు అని అఖిల భారత కిసాన సంఘ్‌ జాతీయ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక హనుమానపేట ప్లైఓవర్‌ నుంచి అనుదితి ఫంక్షనహాల్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో మల్లారెడ్డి మాట్లాడుతూ, రైతాంగ పోరాటం పూర్తిగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో మట్టిమనుషులు సాగించార న్నారు. అప్పటికే ఉన్న ఆర్‌ఎ్‌సఎస్‌ స్వాతంత్రోద్యమంలో గానీ, తెలంగాణ పోరాటంలోగానీ పాల్గొనలేదని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా నైజాం రాక్షస పాలన నుంచి విముక్తి కోసం కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రజలు మూడున్నర ఏళ్లు పోరాడారన్నారు. నవాబుకు అనుకూలంగా కేంద్రం జరిపిన సైనికచర్యలో 2,500మంది విప్లవకారులు అమరులయ్యారన్నారు. నైజాంను స్వతం త్ర రాజుగా కొనసాగించాలని కాంగ్రెస్‌ భావించినా ప్రజాపోరాటంతో విలీనం చేయకతప్పలేదని అన్నా రు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ నైజాం పాలనలో ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్ల సైన్యం అండతో గ్రామాల్లో భూస్వాములు, దేశముఖ్‌లు శిస్తు చెల్లించని ప్రజల వేలాది ఎకరాల భూములను సొంతం చేసుకున్నారని అన్నారు. రక్షణ కౌలు చట్టం కోసం ప్రజలు పోరాటం కొనసాగించారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కమ్యూనిస్టులకు ఉన్న నిబద్ధతను ప్రజలు గుర్తించి వారిని చట్టసభలకు ఎన్నుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన రవికుమార్‌, నాయకులు డబ్బికార్‌ మల్లేష్‌, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మూడావత రవికుమార్‌, మల్లు గౌతంరెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, రెమిడాల పరుశరాములు, పోలేబోయిన వరలక్ష్మి, వినోద్‌నాయక్‌, తిరుపతి రాంమూర్తి, గాదె పద్మ, పాదూరి గోవర్దన, రమేశ, మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-18T01:14:23+05:30 IST