Share News

ఉత్తరద్వార దర్శనానికి గంట ముందుగా రండి

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:35 AM

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ డా. ప్రియాంక ఆలా అధికారులను ఆదేశించారు.

ఉత్తరద్వార దర్శనానికి గంట ముందుగా రండి

రామయ్య భక్తులకు భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ సూచన

భద్రాచలం, డిసెంబరు 17: ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ డా. ప్రియాంక ఆలా అధికారులను ఆదేశించారు. ఈ నెల 23న ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి ఆలయంలో చేస్తున్న ఏర్పాట్లును కలెక్టర్‌ ఆదివారం పరిశీలించారు. 22వ తేదీన గోదావరి నదిలో నిర్వహించే తెప్పోత్సవం, 23న ఉత్తరద్వార దర్శనం కార్యక్రమాలపై ఆలయ అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు నిర్దేశిత సమయం కంటే గంట ముందుగానే తమ సెక్టార్‌కు చేరుకోవాలని కలెక్టర్‌ ఈ సందర్భంగా సూచించారు. కాగా, శ్రీసీతారామచంద్ర మూర్తి దేవస్థానం ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారు ఆదివారం వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

Updated Date - Dec 18 , 2023 | 03:35 AM