Share News

చలి పంజా..

ABN , Publish Date - Dec 26 , 2023 | 10:59 PM

ఉమ్మడి జిల్లాపై చలి పంజా విసురుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి తగ్గుతున్నాయి. ఉదయం 7 గంటలు దాటినా సూర్యుడు కనిపించని పరిస్థితి నెలకొంది.

చలి పంజా..

రంగారెడ్డి అర్బన్‌, డిసెంబర్‌ 26 : ఉమ్మడి జిల్లాపై చలి పంజా విసురుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి తగ్గుతున్నాయి. ఉదయం 7 గంటలు దాటినా సూర్యుడు కనిపించని పరిస్థితి నెలకొంది. తెల్లవారుజామున మంచు కురుస్తుండటంతో పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 9 గంటల వరకు పొగ మంచు కమ్ముకుంటుంది. సాయంత్రం 5 దాటితే చల్లగాలులు వీస్తున్నాయి. గత మూడు రోజుల కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ.. చలి మాత్రం అలాగే ఉంది. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం తాళ్లపల్లిలో 10.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌లో 11.8 కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మౌలాలిలో 12.3 డిగ్రీల ఉష్ణోగ్ర నమోదైంది.

Updated Date - Dec 26 , 2023 | 10:59 PM