హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం కేసీఆర్ భేటీ
ABN , First Publish Date - 2023-08-22T04:26:48+05:30 IST
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధేతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధేతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్చార్డీ)లో ఈ భేటీ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన, కొత్త జిల్లాల్లో జిల్లా కోర్టుల నిర్మాణం, ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ హైకోర్టు సీజేతో చర్చించారు. ఈ సమావేశంలో హైకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ శ్యాం కోషీ, జస్టిస్ అభినందన్‌కుమార్ షావిలి, జస్టిస్ టీ వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, హైకోర్టు రిజిస్ర్టార్ జనరల్ తిరుమలాదేవి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.